ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో యువత అంతా తన వైపే ఉన్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు కరీమాబాదులో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ యూత్ నాయకులు మండ సాగర్, యాట ప్రవీణ్(లడ్డు) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని యువత నేడు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
90శాతం నిరుపేదలు ఉన్న ప్రాంతం ఈ నియోజకవర్గం మన తూర్పు
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో 67 సంవత్సరాలు ఇతర రాజకీయ పార్టీలు పరిపాలించాయని అందులో ముఖ్యంగా కాంగ్రెస్ 55 సంవత్సరాలు 11సార్లు అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదన్నారు వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పాలకులు ఆజాంజాయి మిల్స్ ని అమ్ముకుని కార్మికులను రోడ్డున పడేశారు దేశాయిపేటలోని తోళ్ళ పరిశ్రమ అంతరించిపోతుంటే చోద్యం చూశారన్నారు. నాడు ఉద్యమంలో తాము యువకులగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం పోరాడడం జరిగింది నాడు ఎట్లాగు మా జీవితాలు అయిపోయ్యాయని నేటి తరాలు బాగుండాలనే ఆనాడు ఉద్యమంలో తాము పోరాటాలు చేసి తెలంగాణ సిద్దించే వరకు కొట్లాడడం జరిగింది.
అజాంజాహి మిల్స్ కాంగ్రెస్ పాలకులు అమ్ముకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసుకున్నామని ఇప్పటికే మూడు కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగిందని మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అన్నారు.
తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే 4100కోట్లతో అభివృద్ధి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశామని రింగ్ రోడ్డు చుట్టూ చుట్టూ కంపెనీలు నెలకొల్పుతామన్నారు.
నియోజకవర్గాల జిల్లా కేంద్రం నూతన కలెక్టరేట్, భారతదేశం అబ్భుర పడే విదంగా 1250కోట్లతో 24 అంతస్తులు హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నూతన బస్ స్టేషన్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
గేటు ఇవతలి ప్రాంతంలో రోడ్డు పోసిన నాధుడు లేడు నేడు తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా రోడ్లన్నీ బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నామన్నారు.
ఎప్పుడో జమానాలో పోసిన రోడ్లు నేటి వరకు పరిపాలించిన నాయకులు ఒక్కరు కూడా పట్టించుకోలేదు తాను ఎమ్మెల్యే అయ్యాక చౌరస్తా బండి బజార్ ఇతర ప్రధాన రహదారులన్నీ నూనె పోసి ఎత్తుకునే విధంగా తయారు చేశామన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అంతర్గత సిసి రోడ్లు పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా చోట్ల పూర్తయ్యాయని ఎమ్మెల్యే అన్నారు.
ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి మూల సంతోషం అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలన అందిస్తున్నారని 24 గంటల కరెంట్ రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసిఆర్ కిట్ ఆసరా పెన్షన్ ఇంటింటికి త్రాగునీరు ప్రతి చేనుకు సాగునీరు ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు.
వరద ముంపుకు గురికాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఉన్న కేటీఆర్ చేతుల మీదుగా 158కోట్లతో మిగతా డ్రైనేజ్ పనులకు ప్రారంభించుకోవడం జరిగిందని, మురికి నిరుని శుద్దిచేసే ప్లాంట్ సైతం నెలకొల్పడం జరిగిందన్నారు.
గతంలో పరిపాలించిన నాయకులు ఇక్కడ ఏం చేయలేదని ప్రజలకు తియ్యగా ముచ్చట్లు చెప్పి ఓట్లు దండుకున్నారన్నారు
కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇస్తే ఎం చేయని వాళ్ళు ఇప్పుడేం చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే యువకులకు ఏ ఒక్కరు కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి వారి ఉద్యోగ కల్పనకు దోహదపడలేదన్నారు.
తాను నియోజకవర్గ బిడ్డలు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఉద్యోగాలు సాధించాలని మహేశ్వరి గార్డెన్స్ కోచింగ్, భోజనం, మెటీరియల్ ఏర్పాటుచేసి 110రోజుల పాటు కోచింగ్ ఇవ్వడం జరిగింది.
పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే యోగుల కోసం తన కిట్టులో అందించడం జరిగిందని వారి వ్యాయామాలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసామన్నారు.
మొన్న దసరా బతుకమ్మ ఉత్సవాలు జరిగితే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల నిర్వహణకు ఇబ్బంది తలెత్తితే తాను ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు.
ఇప్పుడు నాయకులం అంటూ మన చుట్టూ తిరిగే వాళ్ళు మన పండుగలప్పుడు సహాయం అందించకుండా ఎక్కడ పోయారని
కరోనా కష్ట కాలంలో మీరు గుర్తుకు రాలేదు
ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు గుర్తుకు రాలేదు
వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు మీరు గుర్తుకు రాలేదు
నేడు బతుకమ్మ దసరా ఉత్సవాలలో కూడా మీరు గుర్తుకు రాలేదు
దేనికి గుర్తు రానివాళ్లం ఓటు కోసం మాత్రం గుర్తుకు వస్తామా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
నమ్మకానికి మారుపేరు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అని భవిష్యత్ లో కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాది కల్పిస్తామన్నారు.
నిరుపేదలకు షాది ముబారక్, దళిత బంధు, గృహలక్ష్మీ అన్ని అందిస్తామని
ప్రభుతం జీవో ఇచ్చి సాంక్షన్ అయ్యి ఉన్నాయని ఎలెక్షన్ కోడ్ ఆగిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో అపోలు సృష్టించిన వారు కళ్ళు తెరిచి దుపకుంటలో డబల్ బెడ్ రూమ్స్ ని రావాలన్నారు.
కాంగ్రెస్ వాళ్లు టికెట్ల దగ్గర తన్నుకునుడే ఎక్కువ మన గురించి ఏం పట్టించుకుంటారన్నారు
యువకులంతా తన వెంటే ఉన్నారని తనకు పదివేల మంది సైన్యమే ఉన్నారన్నారు
లేనిపోని ఆరోపణలు చేసి అబాసపాలు చేద్దామనుకునే వారిని సోషల్ మీడియా వేదికగా మా యువకులంతా తిప్పికొడతారన్నారు.
మొన్న జక్కలొద్ది దగ్గర రాజకీయం చేద్దామని వెళితే కేజిఎఫ్ సినిమా చూపించారని అటువైపు 30 మంది ఉంటే ఇటువైపు 3,000 మంది ఉన్నారు అన్నారు.
ప్రజాస్వామ్యంలో మాకు సహాయం చేయాలని కోరితే తాము గులాబీ కండువా కప్పి కేసీఆర్ అండగా ఉంటారని తెలపడం జరిగిందన్నారు
నియోజకవర్గంలోని 41గుడిసె సెంటర్లకు నీళ్లు, రోడ్లు, కరెంటు ఇంటి నెంబర్ ఇలా సకల సదుపాయాలు అందించడం జరిగిందని అట్లాంటి అవసరమే జక్కలొద్ధిలో వచ్చిందని అక్కడి ప్రజలు మూకుమ్మడిగా 3000 కుటుంబాలు సుమారు 8000 ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగిందన్నారు.
తాను 500 నౌకరి మొదలు పెట్టి కార్పొరేటర్ మేయర్ ఎమ్మెల్యేగా ఎదగడం జరిగిందని కష్ట పడ్డ సొమ్ముతోనే సేవ చేస్తున్నానన్నారు.
ఇప్పుడు ఇక్కడున్న వాళ్లు ఒకరు వర్ధన్నపేట మరొకరు వంచనగిరి అని ఇద్దరు స్థానికేతరులని ఇక్కడ స్థితిగతులు తెలియని వాళ్ళని మన గోసా తెలవని వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారన్నారు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పూటకో పార్టీ మారుతున్నారన్నారు. మొదటగా కాంగ్రెస్ తరవాత వైస్సార్సిపి తరవాత బిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఇలా పూటకో పార్టీ మారే చరిత్ర వాళ్ళది ఇంకో వ్యక్తి మొదటగా తెలుగుదేశం తరవాత ప్రజారాజ్యం, మన తెలంగాణ, బిఆర్ఎస్, బీజేపీ ఇలా ఒక్కదగ్గర నిలకడ లేని నాయకులు ప్రజల కోసం నిలకడగా నిలబడతారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని ప్రజలకోసం పని చేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారన్నారు.
తాను ఇక్కడే పుట్టానని జీవితకాలం ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఆపతి సంపదలో ఎప్పటికీ తోడుంటానని అర్థరాత్రి తలుపు తట్టిన మీకు సేవ చేస్తానన్నారు.
నేను గొంతు ఇప్పిడితే వారి బండారం బయటపడుతుందన్నారు.
ఒక విజన్ తో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా చూపానని సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ సాగుతున్న తరుణంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు.
ఈ పిలగాడు ఎదిగితే ఎట్లా అని కొందరు ఉక్కుపాదం మోపితే కేసీఆర్ ఆశీర్వాదంతో మరో మారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ అందుకొని నేడు బరిలో ఉన్నానన్నారు.
పోయిన ఎన్నికలలో మెజారిటీ కంటే మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చి తనను గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటానని బాసటగా అండగా నిలిచి అన్ని విధాలా తోడుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మరవి,ముష్కమల్ల అరుణ సుధాకర్, మాజీ కార్పొరేటర్ మెడిద మధుసూదన్, డివిజన్ అధ్యక్షులు మీరుపల్లి వినయ్,పొగాకు సందీప్ పూజారి విజయ్ బొరిగం నర్సింగం, బిఆర్ఎస్ నాయకులు మండల శ్యామ్, భూపాల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు హాజరయ్యారు.


Post A Comment: