పెద్దపల్లి:గోదావరిఖని:సెప్టెంబర్:29:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):
ప్రజాసేవే నా ద్వేయం మీ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ తీసుకుంటా సమాజానికి మేలు చేయనోళ్లు కాంగ్రెస్ పార్టీ పాలకులు పేదవర్గాలకు సేవ చేయాలన్నదే నా ఆరాటం తపన,ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్,సేవాస్పూర్తితో పేద వర్గాలకు అందించే మీ సేవలకు తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పెద్దపల్లి జెడ్పి చైర్మన్,మంథని నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హమీ ఇచ్చారు.మంథని మండలంలోని ఆర్ఎంపీ,పీఎంపీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడరు,మంథని మండలంలోని ఆర్‌ఎంపీ,పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవలు అందిస్తుంటారని,వారి సేవాస్పూర్తికి తగిన సహకారం అందిస్తానని అన్నారు.మంథని కేంద్రంగా ఆర్‌ఎంపీ పీఎంపీలకు సౌకర్యవంతంగా ఓ భవనం నిర్మిస్తామని,సమావేశాలు,ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకువీలుగా ఉండేలా చూస్తానన్నారు.అంతేకాకుండా ఆర్‌ఎంపీ,పీఎంపీలకు శిక్షణ కార్యక్రమాలకు సైతం తనవంతు సహకారం అందిస్తానన్నారు.పేదవర్గాలకు సేవ చేసేలా ఆలోచన చేయాలని,హైదరాబాద్‌లో ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఉచితంగా సేవలు అందిస్తోందని,వారి సేవలు ఎంతో గొప్పవన్నారు.అలాంటి సేవలు మంథనిలాంటి ప్రాంతంలో ఉంటే ఎంతో మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు,అనేక ఏండ్లు ఈ ప్రాంతంలో పరిపాలనచేసిన కాంగ్రెస్ పాలకులుప్రజలను పట్టించుకోలేదని,మీలాంటి వాళ్ల సమస్యలను విస్మరించారన్నారు.ఈ సమాజానికి ఏమీ చేయనోళ్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్నారు.తాను ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అనేక సేవలు అందించామని,ప్రభుత్వం ద్వారా సంక్షేమఫలాలను అందించామని గుర్తు చేశారు.రాబోయే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇటు ప్రభుత్వం ద్వారా అటు తన సొంతంగా సేవలు అందించేలా ప్రత్యేకప్రణాళికలు చేసినట్లు తెలిపారు.సమాజానికి సేవ చేసే వాళ్లు అధికారంలో ఉంటే ఎంత ప్రయోజనం జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు.ఆర్‌ఎంపీ పీఏంపీలు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని,ఎవరికి అవకాశం కల్పిస్తే మన ఆకలి,కష్టాలు తీర్చుతారనే విషయాలపై చర్చించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.పేదవర్గాలకు సేవ చేయాలన్నదే తన ఆరాటం,తపన అని ఆదిశగా తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.అనంతరం వారు జై తెలంగాణ జై పుట్ట మదన్న,కారు గుర్తుకే మన ఓటు అంటూ పూర్తి మద్దతు తెలిపారు..

Post A Comment: