జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్
జుక్కల్ న్యూస్ టుడే;
కెసిఆర్ నోట జూటా మాట
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో కేసీఆర్ మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లో పీజీ కళాశాల, రైతుబంధు, మిషన్ భగీరథ,కళ్యాణ లక్ష్మి పలు పథకాల గురించి వివరించారు. బిచ్కుంద లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం గురించి మాట్లాడారు. కానీ వాస్తవంగా 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ అందులో సరియైన వైద్య సదుపాయాలు, డాక్టర్లు లేరు మరియు పీజీ కళాశాల గురించి చెప్పారు నియోజకవర్గం లో రెండు దఫాల టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కూడా కళాశాల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కెసిఆర్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి సరియైన రోడ్డు సౌకర్యం కూడా లేదు వ్యవసాయానికి సరియైన నీరు లేదు. కెసిఆర్ మాట్లాడుతూ పక్కనే ఏర్పడ్డ కర్ణాటక ప్రభుత్వం గురించి విమర్శించారు. మహారాష్ట్ర గురించి అక్కడ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి గురించి విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాలకే అనేక అభివృద్ధి పనులు చేశా మని చెప్పారు.

Post A Comment: