మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న,
పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:31:23:వందల కోట్లు ఉన్న అధిపతికి.పేదింటి ఆడబిడ్డకు మధ్య ఈ ఎన్నికల యుద్ధం కొనసాగుతుందని వారికి సరైన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి పేర్కొన్నారు,అంతర్గం మండలంలో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంగళ హారతులతో మహిళలు స్థానిక ప్రజలు సంధ్యారాణికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడరు...కరోనా కష్టకాలంలో కనీసం గ్రామాల వైపు కన్నెత్తి చూడని నాయకులు ఎన్నికలు రావడంతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం వస్తున్నారని వారికి బుద్ధి చెప్పే సరైన సమయం వచ్చిందని అన్నారు.ఎంతో మంది నుండి ఉద్యోగాల పేరుతో తన అనుచరులు డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనకు గుర్తింపు ఇవ్వకుండా ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆరోపించారు.మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి బిజెపి పార్టీ నుండి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.గెలిచాక ఈనాడు గ్రామాలవైపు చూడని నాయకులకు ఓట్లు వేసి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు.రామగుండం మండలంలోని అంతర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రజలతో కుటుంబ సభ్యులుగా నాకు సన్నిహిత్యం ఉందని ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయనిఇప్పటివరకు ఓటమి ఎరుగని నాయకురాలిగా గెలిపించిన ప్రజలు బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు.ఎటువంటి పదవి లేకుండా 30 ఏళ్లుగా రాజకీయంలో ప్రజలకు సేవ చేస్తున్నానని మహిళగా రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగాగెలిపించాలని కోరారు.నరేంద్ర మోడీ నాయకత్వంలోగ్రామాలతో పాటు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు.అనంతరం ఎగ్లాస్ పూర్ నుండి కందుల సత్తయ్య,ఆకునూరి కర్ణాకర్,మాదాసి శంకర్,అల్వాల కొమురయ్య,వడ్డేపల్లి పర్వతాలు,కంది రాజేందర్,తూడూరి హరీష్,దొరిశెట్టి కుమార్,కట్కూరి వెంకటేష్,అడెపు రామయ్య,దిగుట్ల స్వామి,ఐట్ల రంజిత్,గోర్క రాంబాబు,మాదాసి ఉదయ్,బాలసాని సత్తయ్య గౌడ్ లు బిజెపి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సంధ్యారాణి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో చిలుక శంకర్,ఆర్ముల్లా శంకర్,చిలుక రమేష్,రాజేందర్,నరేష్,లక్ష్మణ్,శంకర్,గోలీవాడ సాయి కృష్ణ,గుమ్ముల నరేష్,వెంకన్న,పురుషోత్తం,రవి చరణ్,రమేష్,డేవిడ్,రాజు,తిరుపతి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: