మెదక్ జిల్లా ప్రతినిధి పవన్
మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని వెంకటపూర్ గ్రామంలో బీమ్లాతాండలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు,కార్యకర్తల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒకరు తామే ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి శ్రమించాల్సిన అవసరం ఉందని,ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఓటరుకు,గడప గడప కు ప్రజల లోకి తీసుకుని పోవాలని దిశ నిర్దేశం చేశారు... తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీ పథకాలను ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, యువ వికాసం, మహాలక్ష్మి, గృహాజ్యోతి,చేయూత,ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ,500 రూపాయల గ్యాస్ సిలిండర్ తదితర పథకాలను ఇతర సంక్షేమ పథకాలను,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు సైనికుడిగా పని చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు భక్తుల కిషోర్. మండలపు ఆప్షన్స్ సభ్యులు షేక్ మజార్. ఆకులపల్లి పాపయ్య. సేవాలాల్. చంద్రమోహన్ రెడ్డి. సాయిలు. సోమన్న. ఎర్రోళ్ల ప్రవీణ్. సాయి. శేషు గౌడ్. జాదవ్. సంతోష్. ఇమ్రాన్. మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు


Post A Comment: