మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ పుట్ట రాజన్న...
పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటాలు నమ్మవద్దని...సింగరేణి కార్మికుల పక్షపాతి సిఎం కేసీఆర్ అని..సింగరేణి కార్మికుని బిడ్డగా..కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వాడిగా..ఉద్యమ నాయకుడిగా,మీకు మరింత సేవలందించడానికే తపన పడుతున్నానని కార్మికన్నాలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతూగా నిలిచి నవంబర్ 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలనిరామగుండం నియోజకవర్గ అభ్యర్థి,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.సింగరేణి సంస్థ ఆర్జీ-2పరిధి వకిల్ పల్లి సమీపంలో మంగళవారం నిర్వహించిన ప్రజా అంకిత యాత్రలో కార్మికులను పేరుపేరునా పలకరించారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్మికులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంత రం ఆయన మాట్లాడరు,కోల్ ఇండియాలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే నన్నారు.మారుపేర్ల సవరణ మినహా సాధారణ ఎన్నికలలో,గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితక్క నెరవేర్చారన్నారు,కారు గుర్తుకు ఓటు వేసి మరొకమారు ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని,కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయరెడ్డి,ఆర్జీ-2ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్,బిఆర్ఎస్,టీబీజీకేఎస్ నాయకులు జహిద్ పాషా,భానకర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: