ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. శనివారం హనుమకొండ ఏకాశిల పార్క్ నుండి హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడి టీచర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బందితో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరై ఓటర్ ప్రతిజ్ఞ చేపించి, పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా మాట్లాడుతూ. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవవచ్చునని

తెలంగాణ రాష్ట్రం లో రాబోయే 8 నెలల్లో 4సార్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుందనీ ఓటు వేయడాన్ని ఓక బాధ్యత గా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ అన్నారు.

పోలింగ్ కేంద్రాలు మీ ఇంటికి కేవలం 2కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయనీ వికలంగులు, వృద్దులు ఓటు వేసేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనీ అన్నారు. గత ఎన్నికలలో మన జిల్లా వ్యాప్తంగా 59% శాతం పోలింగ్ నమోదయిందనీ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పోలింగ్ 100% శాతాన్ని పెంచేందుకు ఈ రోజు ఓటర్ అవగాహన ర్యాలీ జరిగిందని ట్రైనీ కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మెప్మా పి.డి. భద్రు నాయక్, ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, మెప్మా డీ.ఎం.సీ. రజిత రాణీ, మెప్మా ఏ.డి.ఎం.సి. వెంకట్ రెడ్డి, సి.ఒలు శ్రీనివాస్ , నాగరాజు, రమేష్, శ్రీలత, స్వాతి ,సునీల్  మరియు అర్.పి పలు, పలు మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు,  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: