జగిత్యాల: జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో చోటుచేసుకున్న అమానుష ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే సిబ్బంది పడుకున్న విద్యార్థులపై చీపురుతో దాడి చేసిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాధిత విద్యార్థుల వాంగ్మూలాల ప్రకారం, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న వారిని లేపుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులు “మమ్మల్ని కొట్టొద్దు” అంటూ వేడుకున్నప్పటికీ అతను ఆగకుండా దాడి కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనతో హాస్టల్‌లో భయానక వాతావరణం నెలకొంది. కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు కూడా తెలిసింది. ఇక, శ్రీనివాస్ తరచూ మద్యం మత్తులో ఉండి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయితే ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
ప్రతి మండలంలో మద్యం దుకాణం తప్పక కనిపిస్తోంది. కానీ అదే మండలంలో ఒక సరిగ్గా పనిచేసే గ్రంథాలయం కనిపించడం మాత్రం కష్టంగా మారింది. ఇది సమాజ అభివృద్ధి దిశపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు బలం ఇచ్చేది గ్రంథాలయాలు. కానీ నేటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జ్ఞానాన్ని పక్కన పెట్టడం జరుగుతోంది. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు సరైన పుస్తకాలు, ప్రశాంత వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వైన్స్ దుకాణాలు రాత్రివేళల వరకు కిటకిటలాడుతుంటే… మరోవైపు గ్రంథాలయాలు లేక యువత ఖాళీగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మండలంలో కనీసం ఒక ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. పుస్తకాలతో పాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని చిట్యాల మండలంలో ఇటీవల బీసీకి చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కుమారస్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రవి పటేల్, రాజ్యాంగం అమలులోకి వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా బీసీలపై అగ్రకులాల వ్యక్తులు భౌతిక దాడులు చేయడం, దూషణలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో, బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, అలా జరిగితేనే ఆధిపత్య కులాల దౌర్జన్యాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని రవి పటేల్ పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి యథేచ్ఛగా తిరుగుతూ ఇంకా ఎన్ని మందిపై దాడులు చేసిన తరువాత చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. భూకబ్జాలు, మట్టి మాఫియా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వెంటనే అరెస్టు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాదు మల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, గతంలో కూడా అనేక క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
పెద్దపల్లి.మార్చి.1,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)44 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన మావో మల్లోజుల పెద్దపెళ్లికి కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపు..మావోయిస్టు పార్టీ మాజీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారతో కలిసి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం వచ్చారు.సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి అలింగణం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1980 వ దశలో అన్న కిషన్ జితో కలిసి ఉద్యమ బాటపట్టి 44 ఏళ్ల పాటు సాయిధ పోరాట జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే..అయితే అప్పటినుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది.మల్లోజుల సోదరుడు అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యారు.ఆయనను కలవడానికి వచ్చిన మల్లోజులను.పెద్ద సంఖ్యలో బంధువులు.స్నేహితులు తరలివచ్చారు కొంతసేపు కుటుంబ సభ్యులు.స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరితో కలిసి ఫోటోలు దిగారు.మల్లోజుల పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేకంగా నిఘ ఉంచింది.అయితే మల్లోజుల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.మల్లోజుల రాక పెద్దపల్లిలో చర్చనీయంగా మారింది...














