జిల్లాలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ (MRI) యంత్రానికి అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: