కాటారం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాటారం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. ఆమెతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డి పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో జరుగుతున్న శుభ్రత పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రజా ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో రోజువారీ నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు క్రమబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని క్రిమేటోరియంను సందర్శించి నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పంత కానీ సడువలి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: