November 2024
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

 బాలలు సోషల్ మీడియా కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని, అందుకే సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. 

శనివారం హనుమకొండ లోని కాళోజీ కళాక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాస్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలల హక్కుల థీమ్ “బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడదాం” అని తెలియజేస్తూ బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ -1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  బాలలందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాలలో నిర్వహించే పలు కార్యక్రమాలు బాలలకు వారి హక్కులపై అవగాహన కలిగిస్తాయని అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలిపి హనుమకొండ జిల్లాలోని వివిధ సిసిఐ బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

అలాగే గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి మాట్లాడుతూ బాలలలో ఉన్న ప్రతిభను వెలికితీస్తే అద్భుతాలు చేయగలరని తెలిపారు. 

కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన  గావించారు 

ఈ సందర్భంగా ప్రపంచ చెస్ ఛాంపియన్  షిప్ లో రెండవ స్థానం పొందిన అర్జున్ ను ఘనంగా సన్మానించారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో  ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కు చెక్కులను అందజేశారు

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఇవి. శ్రీనివాస్,  కార్పొరేటర్ రావుల కోమల, ప్రాజెక్టు లెవెల్ సిడిపిఓలు స్వాతి, భాగ్యలక్ష్మి, సి డబ్ల్యూ సి మెంబర్స్, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బాల సదనాల నిర్వాహకులు, చైల్డ్ లైన్, డిసిపియు సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, అంగన్ వాడి పిల్లలు, వివిధ పాఠశాలల నుండి 800 మంది చిన్నారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

 



హన్మకొండ ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  ఆదేశాలతో  జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై  జిల్లా పోలీసులు తనిఖీ నిర్వహించారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ అన్నారు. బ్యాంకుల్లో దొంగతనాల నివారణకు, ముందస్తు  భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా పరిధిలోని ఎస్సైలు, సిఐ  లు, డీఎస్పీలు ఏక కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మరియు ఏటీఎం  ల వద్ద భద్రతా పరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే  ఘనపురం మండల కేంద్రంలోని  డిస్ట్రిక్ట్  కో ఆపరేటివ్ బ్యాంక్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ

సీసీ టీవీ కెమెరాలు జిల్లాలోని అన్ని బ్యాంకులు భద్రత ప్రయోజనాల కోసం  కలిగి ఉండాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రైవేట్ బ్యాంకు శాఖలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో గుర్తించన విషయాలపై  భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు  అధికారులకు సూచించారు. బ్యాంకు ఆవరణ అంతా కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్,  సీసీ కెమెరాలు, లైటింగ్,  బ్యాంకుల్లో భద్రత లోపాలు  ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని  అన్నారు. ఈ తనిఖిల్లో  భూపాలపల్లి, కాటా రం డీఎస్పీలు జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సై  లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;

వరదలు వచ్చినప్పుడు గానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, ఎవరైనా నీటిలో మునిగినప్పుడు ఎలా కాపాడాల నే విషయంపై పౌరులందరికీ అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పౌరులను ఎలా కాపాడాలనే విషయంపై ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మాకు డ్రిల్ నిర్వహించింది.ఈ మాక్ డ్రిల్ లో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ, మునిసిపల్ డి ఆర్ ఎఫ్ బృందాలు వారి శాఖల ద్వారా ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలను ఎలా కాపాడాలనే విషయంపై అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు.విపత్తుల సంభవించినప్పుడు ప్రజలు తమంతట తామే రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అప్పయ్య,జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, అగ్నిమాపక శాఖ అధికారి జయపాల్ రెడ్డి, జి డబ్ల్యూ ఎం సి మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని తేజస్వి పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండలోని సైన్స్ సెంటర్ ను ఆధునికరించడానికి 10 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. త్వరలోనే వాటి పనులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతులమీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు.సైన్స్ లేకుండా జీవితం లేదన్నారు. సైన్స్ ఫెయిర్ లలో పాల్గొన్న ప్రదర్శనలన్నింటిని టీచర్లు రాసుకొని తమ తమ పాఠశాలలో విద్యార్థులకు వివరించాలన్నారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందన్నారు. ప్రపంచ స్థాయిలో దేశాల మధ్య ఆర్థిక పరమైన పోటీలకన్నా శాస్త, సాంకేతిక రంగాలలోనే అతి పెద్ద పోటీ నెలకొని ఉందన్నారు. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్ కలాం ఆశించిన విధంగా విద్యార్థులు కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలన్నారు. నిత్య జీవితంలో సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇన్స్పైర్ కు గాను కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయం అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ తమలోని సృజనాత్మక ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక అంశాలను ప్రదర్శించేందుకు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ అనేది గొప్ప అవకాశం అన్నారు. ప్రతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ప్రాక్టికల్స్ ఎక్కువగా చేస్తే విద్యార్థులకు ఆ సబ్జెక్టు అంతగా అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద ల్యాబ్ లను అభివృద్ధి చేశామన్నారు. అంతేగాక స్మార్ట్ టీవీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎక్కువగా ఎక్స్పరిమెంట్ వీడియోలను చూపించాలని ఉపాధ్యాయులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష 20 వేల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని, వీరందరికీ పాఠశాల దశ నుంచి సైన్స్ పట్ల అభిరుచి కలిగెలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సైన్స్ ఫెయిర్ లో నాణ్యమైన ప్రదర్శనలు రావడానికి గాను సైన్స్ టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనల ప్రదర్శనతో పాటు పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, డిస్కషన్స్ లాంటివి కూడా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో జాతీయ స్థాయి పోటీకి హనుమకొండ విద్యార్థులు ప్రదర్శనలు వెళ్లారని తెలిపారు.

ఈ ప్రదర్శనలో 120 ఇన్స్పైర్ ఎగ్జిబిట్లు, 106 జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్, తేజస్వి పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా  విధులు నిర్వర్తించాలని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  పేర్కొన్నారు.  శుక్రవారం ఎస్పి  ఘనపురం  పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా  పెండింగ్ లో ఉన్న కేసులు, విధుల నిర్వహణ, పరిష్కారం, పోలీస్ స్టేషన్లోని  కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నియంత్రణకు సంబంధించిన చర్యల గురించి ఎస్సై  అశోక్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని పెండింగ్  కేసులు, రికార్డులు మరియు రికార్డ్ రూమ్, రైటర్ రూమ్, లాకప్ రూం వివిధ  విభాగాలను  క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ఎస్పి  మాట్లాడుతూ  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు.  సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మండలంలో  ఎక్కువ మొత్తంలో  సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పి కిరణ్ ఖరే ఆదేశించారు. అంతకు ముందు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా  ఘనపురం మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ లో  భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరాల పనితీరు, బ్యాంకుకు సంబందించిన  భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, బ్యాంక్  అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేశ్ ఘనపురం ఎస్సై  ఆర్. అశోక్, సీసీ ఫసియుద్దిన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;

జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతుందని  హనుమకొండ జిల్లా కలెక్టర్  పి.ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం  కొత్తపల్లి పరిధిలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి ధాన్యానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులను, ఇప్పటివరకు ధాన్యం  కొనుగోలు కేంద్రానికి  వచ్చిన ధాన్యం వివరాలను నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎంత ధాన్యం వస్తుందని వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ధాన్యం  విక్రయించిన రైతుల వివరాలను ఆన్లైన్లో  నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. 40కి పైగా మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, పౌరసరఫరాల శాఖ మేనేజర్  మహేందర్, ఏడిఏ లక్ష్మీనారాయణ, ఏవో పద్మ, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ లో  చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్  పి.ప్రావిణ్య  అధికారులను ఆదేశించారు. 

మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అధికారులను, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను  కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదిలో  ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులకు  పాఠం చెబుతుండగా కలెక్టర్ పాఠ్యాంశ బోధన తీరును  పరిశీలించారు. పాఠశాలకు సంబంధించి  ఏవైనా సమస్యలు ఉన్నాయా అని  కలెక్టర్ అధికారులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ముల్కనూర్  లోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ పాఠశాలో వివిధ అభివృద్ధి పనులు, వసతుల కల్పన నిమిత్తం రూ. 30 లక్షల  ను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులలో విద్యుత్  పనులు పూర్తయ్యాయని, టాయిలెట్స్ మరమ్మతు  పనులు దాదాపు పూర్తయ్యాయని  తెలిపారు. ఫ్లోరింగ్ పనులు నడుస్తున్నాయని అన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న ఫ్లోరింగ్ పనులను  త్వరితగతిన వచ్చేనెల నాటికి పూర్తి చేయాలని  ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం వండుతున్న కిచెన్ షెడ్ కు సంబంధించి మిగిలి ఉన్న  ఫ్లాట్ ఫాం పనులను  త్వరగా పూర్తి చేయాలని  ఆదేశించినట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ ఏరియా, తదితర పనులను కూడా వచ్చే పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మెనూ ప్రకారం  విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు  ప్రమాణాల ప్రకారం పౌష్టికాహారం  నాణ్యతతో  అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతతో పౌష్టిక ఆహారం అందుతుందా లేదా అనేందుకు  జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.   కమిటీని  నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం  అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో భోజనం అందిస్తున్నారా లేదా అనేది పరిశీలించినట్లు పేర్కొన్నారు. మెనూ ప్రకారం అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు  ఒక్కో మండల స్థాయి అధికారికి మూడు నాలుగు పాఠశాలలను  కేటాయించినట్లు తెలిపారు. అధికారుల కేటాయించిన విధంగా మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు.  రెగ్యులర్ గా మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామాజిక ఆర్థిక సర్వే డేటా  ఎంట్రీ కేంద్రాన్ని పరిశీలించినట్లు  పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా  పరిశీలించినట్లు చెప్పారు. వంద శాతం సర్వే జిల్లాలో పూర్తయిందని, అర్బన్ ఏరియాలో  తాళాలు వేసి ఉన్నాయి ఇళ్లలో కొన్నిమాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. వీటిని కూడా మూడు రోజుల్లో  పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో  డేటా ఎంట్రీ ప్రక్రియ మొదలైందన్నారు. సర్వే వివరాల డేటా ఎంట్రీ కూడా ఆరు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 



విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..


 ముల్కనూరులోని  తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రావిణ్య మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. 

ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, ఏఈ వినయ్, పాఠశాల ప్రిన్సిపల్  ఎండి రెహమాన్ ముజీబ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )లో పేర్కొన్న అన్ని వివరాలను ఎన్యుమరేటర్ సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు జాగ్రత్తగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల ను ఎన్యుమరేటర్ల సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే వివరాలను నమోదు చేస్తున్నారని, ఇప్పుడు వరకు ఎన్ని పూర్తి చేశారని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ సర్వే వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా పకడ్బందీగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేయాలన్నారు. ఇచ్చిన సర్వే వివరాలతో కూడిన పత్రాలు, ఆన్లైన్లో నమోదు చేసిన వాటి సంఖ్యను సరిచూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలోని పలు గురుకుల హాస్టల్స్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం తనిఖీ చేశారు. హాస్టల్స్ తనిఖీలో భాగంగా  విద్యార్థులకు అందిస్తున్న భోజనంతోపాటు ఆహార పదార్థాలు, కూరగాయలు, గుడ్లు, తాగునీరు, వంట చేసే కిచెన్ ప్రదేశాలను జిల్లా అధికారులు పరిశీలించారు. ధర్మసాగర్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల, కేజీబీవీ పాఠశాలను డి ఆర్ డి ఓ మేన శ్రీను   తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలకు సంబంధించి ఆహార పదార్థాల నిల్వను తనిఖీ చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని  సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ ను  అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు తనిఖీ చేశారు.  ఆత్మకూరులోని  కేజీబీవీ పాఠశాలతో పాటు పెద్దాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను  గృహ నిర్మాణ డి ఈ రాజేందర్ తనిఖీ చేశారు. పరకాల లోని  మైనారిటీ బాలికల  గురుకుల పాఠశాల కళాశాలను  జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ వెంకటనారాయణ తనిఖీ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

సివిల్ వివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన 18 మంది  నుంచి ఎస్పి పిర్యాదులు స్వీకరించి, వాటిని చట్టప్రకారం  పరిష్కరించాలని సంబధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే  ప్రజల  ఫిర్యాదులను  పెండింగ్లో ఉంచరాదని వాటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు సైబర్ నేరాల  పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో  డయల్ 100 కు ఫోన్  చేయాలని ఎస్పి కిరణ్ ఖరే  పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;

ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కరదీపికను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం సమావేశ మందిరంలో  ఆవిష్కరించారు. ఈ కరదీపిక వైద్యాధికారులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అలాగే ప్లానింగ్ మరియు సిబ్బందికి శిక్షణ అందించేందుకు ఉపయోగపడుతుంది అన్నారు .అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  వెంకట్ రెడ్డి ,జిల్లా రెవెన్యూ అధికారి  గణేష్ ,డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎ అప్పయ్య ,డిఆర్డిఓ  మేన శ్రీను ,జిల్లా పరిషత్ సీఈవో  విద్యుల్లత,హనుమకొండ పరకాల ఆర్డీవోలు శ్రీ నారాయణ , రమేష్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి వాసంతి,జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జయంతి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;

తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007పై హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, హెల్ప్ ఏజ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే హాజరై మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సేవలను అందిస్తుందని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అదరపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ సంబంధిత కార్యాలయాలన్నింటిలోనూ వృద్ధులకు ప్రత్యేక సేవలను అందించాలని అన్నారు. కార్యాలయాలకు వచ్చే వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్వర సేవలందించాలని పేర్కొన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో వయోవృద్ధుల చట్టంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వయోవృద్ధులను వారి పిల్లలు, కుటుంబీకులు పట్టించుకోనట్లయితే రెవెన్యూ డివిజనల్ ఆధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ అధికారి శ్యాం కుమార్, ఎఫ్ఆర్వో రవికృష్ణ, ఇతర జిల్లా అధికారులతో పాటు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణ్యపురి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

                                          నిర్మల్,నవంబర్,21(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)దోషులకు శిక్ష పడేలా చేసి చిన్నారి బాబుకు న్యాయం చేయండి,ఎస్పీ కి విజ్ఞప్తి చేసిన పోగుల లత కుటుంబీకులు,ప్రజా సంఘాలు.ఈసమాజంలో జరుగుతున్న వరకట్న హత్యలను,వేధింపులను అరికట్టాలని పోగుల లత న్యాయ పోరాట కమిటి ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిలకు,లత కుటుంబీకులు,మహిళా,ప్రజా,హక్కుల సంఘాల నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు.జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పోగుల(సంద)లత నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటలో ఈనెల 8న హత్య జరిగిన సంగతి తెలిసిందే..ఈ హత్యపై సమగ్ర విచారణ చేపట్టి,దోషులకు చట్టపరంగా శిక్ష పడేలాచేసి,లత కొడుకు అయిన 18 నెలల చిన్నారి బాబుకు న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ ఎ.గంగారెడ్డిలకు వేర్వేరుగా ప్రత్యేక వినతి పత్రాలు అందజేశారు.నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేటలో నవంబర్ 8న జరిగిన అదనపు వరకట్న వేధింపుల హత్యలో మరణించిన పోగుల లత కేసుపట్ల పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి చట్ట పరంగా సరైన న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు.పోగుల లత వివాహం జరిగిన నుండి హత్య జరిగిన రోజువరకు చోటు చేసుకున్న సంఘటనలు,అదనపు వరకట్న వేధింపులు,లత హత్యపై గల అనుమానాలను,ఇతరత్రా విషయాలను వినతి పత్రాల ద్వారా జిల్లా ఎస్పీకి వివరించారు.ఇలాంటి వరకట్న హత్యలు,వేధింపులు.బాల్య వివాహాలు,మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకోకుండా చూడాలని పోగుల లత న్యాయ పోరాట కమిటి ఎస్పీ డా.జానకి షర్మిల ను కోరారు.లత హత్యనే ఈ రాష్ట్రంలో చివరి హత్య కావాలని,ఇకముందు ఇలాంటివి రాష్ర్టవ్యాప్తంగా మరెక్కడా కూడా జరుగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల
మాట్లాడరు.నేను కూడా సాటి మహిళనే..అని,ఇలాంటి సంఘటనలు ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్య తీసుకుంటామని బాధ్యత మాపై ఉందని ఈకేసు విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని జిల్లా ఎస్పీ తెలిపారు ఒక మహిళగా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను,అక్రమాలను అరికట్టి సమాజానికి నావంతు సేవ చేయాలనే తపనతోనే ఉద్యోగంలో చేరానని జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల తెలుపడం మాకు గర్వంగా ఉందని మహిళా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.నిర్మల్ జిల్లా ఎస్పీని కలిసిన వారిలో పోగుల లత న్యాయ పోరాట కమిటి కన్వీనర్ అయిన ఐద్వా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్గొండ పద్మ,కో-కన్వీనర్లు చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాల్లు కే.శ్రీదేవి,ఒటారికారి శ్రీదేవి,సుశీల,పోగుల మల్లేశ్వరి,జల,పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి,జై భారత్ సంస్థ నాయకురాలు పద్మ,రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముని మడుగుల మల్లన్న,మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దేవి సత్యం,భారత నాస్తిక సమాజం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ బొమ్మేన రాజ్ కుమార్,ఖానాపూర్ బానాస,ప్రజా సంఘాల నాయకులు బొమ్మేన రాకేష్,రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డా.యం.గజ్జారాం,నిర్మల్ జిల్లా సామాజిక కార్యకర్త బాల్నేని అజయ్,విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య,నాయకులు పుట్ట రాజన్న,తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటి రాష్ట్ర స్టీరింగ్ కమిటి సభ్యులు,జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం రాజ మల్లయ్య,తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి,దళిత లిబరేషన్ ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ రామిళ్ళ బాపు,తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గాండ్ల మల్లేశం, దేవి సత్యం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు,పోగుల తిరుపతి,ఓరగంటి రమేష్,రంగు మల్లేష్,కానగంటీ నర్సయ్య,పోగుల శ్రీను,తంగెళ్ళ చంద్ర మౌళి,వొడ్నాల రాజేశం,వొడ్నాల శంకర్,సాతల్ల రమేష్, కాసారపు గణేష్ తదితరులు పాల్గొన్నారు...
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;  కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఫౌండేషన్ కార్యదర్శి వి. ఆర్. విద్యార్థి అధ్యక్షతన కవి సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల కాలంగా వరంగల్ కవిలోకం ఎదురుచూస్తున్నటువంటి వేదిక కాళోజీ కళాక్షేత్రంను ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని, ఈ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ తరుపున ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది' అంటూ జీవితమంతా సమాజం కోసం అంకితం చేసిన మహా వ్యక్తి, శక్తి కాళోజీ అని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ వరంగల్ కవిలోకం ఎదురుచూసిన కల ఆవిష్కృతమైందని కవులు, రచయితలు, కళాకారులు వరంగల్ ను గొప్ప సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి బిల్ల మహేందర్ ఆహ్వానంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంకు అతిథులుగా ఆచార్య బన్న అయిలయ్య, అనిశెట్టి రజిత, ముహమ్మద్ సిరాజుద్దీన్, సీతాల రాఘవేందర్, డిపీఆర్ఓ  భానుప్రకాశ్ లతో పాటు కవులు నెల్లుట్ల రమాదేవి, అంజనీదేవి, చింతల కమల, దేవులపల్లి వాణి,  మాధారపు వాణిశ్రీ, అన్వర్ , తాడిచర్ల రవి, కుమార్ , పల్లేరు వీరస్వామి, కార్తీకరాజు, జితెందర్, మహ్మద్ గుల్షన్ , ఉమ, రమాదేవి, వందన, రాజమోహన్ , వకులవాసు, హాజీనూరానీ, శంకర్ నారాయణ, అనిత, విద్యాదేవి, పెద్ది వెంకటయ్య,, మస్నా వెంకటేశ్వర్లు, వి.రవికుమార్ , వలబోజు రాంబ్రహ్మచారి, బూర భిక్షపతి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

 ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను   ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. 

ఈ క్రమంలో పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషి పెయింటింగ్స్ అండ్ మాస్క్స్, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు, తదితర స్టాళ్లను పర్యవేక్షించి, ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను, వారు చేస్తున్న బిజినెస్ లా గురించి , టార్నోవర్ తదితర వివరాలను స్టాళ్ల నిర్వాహకులను ముఖ్య మంత్రి అడిగి తెలుసుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క),

మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సిఎస్  శాంత కుమారి, వరంగల్  మేయర్ గుండు సుధారాణి,వరంగల్ ఎంపీ కావ్య,బలరాం నాయక్,శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి,యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ  లు బస్వారాజు సారయ్య, తీన్మార్ మల్లన్న,వరంగల్, హన్మకొండ కలెక్టర్ లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

అద్భుతం ఆవిష్కృతమైంది కలలు కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు కళామతల్లి శిఖలో మరో మణిహారం తొడిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లా ప్రజలు కళాకారులు కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజి కళాక్షేత్రం మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పోలీసు గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హనుమకొండ కూడా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2.30 కి చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా కాళోజి కళాక్షేత్రానికి చేరుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తో కలిసి ముందుగా ప్రముఖ కవి కాళోజి నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపణలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా చేశారు. అనంతరం కలాక్షేత్ర భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ నుండి నేరుగా కాళోజీ కళాక్షేత్ర భవన క్రింది అంతస్తు లో కాలోజి నారాయణరావు వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫోటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్ రావులు ముఖ్యమంత్రికి కాళోజి జీవితం అక్కడి వస్తువుల గురించి వివరించగా ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆడిటోరియం లో కాళోజి జీవిత విశేషాలతో నిర్మించిన లఘ చిత్రాన్ని కాళోజి ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి విక్షించారు. ఈ సందర్బంగా ప్రముఖ రచయిత అంపషయ్య నవీన్ ట్రస్ట్ సభ్యులు ముఖ్యమంత్రికి పుష్పగుచం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆడిటోరియం బయట ఇందిరా ఫెలో షిప్ సభ్యులు, స్థానికి పార్టీ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కలిశారు. అక్కడ నుండి నేరుగు ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మధ్యాహ్నం 3.35 ని బయలుదేరారు.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన వివరాలు:

కాళోజి కళాక్షేత్రం ప్రారంభం - 90  కోట్లు  

అండర్ డ్రైనేజీ వ్యవస్థ శంఖుస్థాపన - 4170  కోట్లు 

నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం - 12  లక్షలు 

నయీమ్  నగర్ బ్రిడ్జి ప్రారంభం - 8.30 కోట్లు

వరంగల్ తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపన - 3  కోట్లు

పాలిటెక్నిక్ కళాశాల శంఖుస్థాపన - 28  కోట్లు

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆర్ & ఆర్ లేఔట్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు శంఖుస్థాపన  - 863  ప్లాట్లు, 5 లక్షల @ 43.15 కోట్లు  

ఫ్లడ్ డ్రైనేజీ సిస్టం శంఖుస్థాపన - 160.3 కోట్లు 

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ టౌన్షిప్ ఆవరణలో  పిహెచ్సి , ప్రైమరీ స్కూల్, పశు వైద్యశాల శంకుస్థాపన - 13  కోట్లు 

వరంగల్ పట్టణం రహదారుల అభివృద్ధి శంకుస్థాపన  - 49.50 కోట్లు

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్డు  4  లైన్ల విస్తరణ - 65.0 కోట్లు

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మౌలిక సాధుపాయల కల్పనకు శంకుస్థాపన  – 11.6 కోట్లు

వరంగల్ ఎల్ బి నగర్ లో ఉర్ధు భవనం శంకుస్థాపన – 1.50 కోట్లు

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క),రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మధుసూధనాచారి, గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంఏ యుడి ప్రిన్సిపాల్ సెక్రెటరీ దానా కిషోర్, రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ప్రావీణ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, లు ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



హన్మకొండ ;

 విధులను బాధ్యతతో నిర్వహించి ఉద్యోగ శిక్షణ పొందాలని ప్రిన్సిపాల్ శరదృతి అన్నారు.  

వరంగల్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం

చదువుతున్న విద్యార్ధినులను 

కళాశాల ప్రిన్సిపాల్ శరధృతి సోమవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కి పంపించారు. ఇంటర్మీడియట్  

ఒకేషనల్ చదువుతున్న విద్యార్ధినులకు నెల పదిహేను రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. కళాశాల అధ్యాపకురాలు శ్వేత ఆధ్వర్యంలో ఎంజీఎం కు శిక్షణ నిమిత్తం పంపించారు. శిక్షణ కు ఎంజీఎం ఆసుపత్రి కి వెళుతున్న విద్యార్థి నులకు ప్రిన్సిపాల్ శరదృతి పలు సలహాలు సూచనలు చేశారు. రోగుల పట్ల వినయ విధేయతలతో మసలుకోవాలని,బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల, ప్రవళిక,అధ్యాపకులు శ్రీనివాసశర్మ,హరికృష్ణ ,డాక్టర్ కరుణశ్రీ,కవిత,హేమలత, మనోహర్,షబానా,శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

ఇటీవల రాష్ట్ర స్థాయి కరాటే పోటీ లో వరంగల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినికి ద్వితీయ బహుమతి లభించింది. కృష్ణా కాలని వరంగల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.అనుష్క ఖమ్మం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీ లో ద్వితీయ బహుమతి లభించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ శరధృతి అభినందనలు తెలిపారు.శాలువాతో సన్మానం చేసి పూలగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో  జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల,ప్రవళిక,స్టాఫ్ సెక్రెటరీ శ్రీనివాసశర్మ,  అధ్యాపకులు హరి కృష్ణ,డాక్టర్ కరుణ శ్రీ,షబానా,కవిత,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

  ఈనెల 19 మంగళవారం  రోజున వరంగల్ నగర పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి   రానున్న నేపథ్యంలో  హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో  బహిరంగ సభ నిర్వహించనున్న  నేపథ్యం లో సభా స్థలి ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీమతి కొండ సురేఖ  దుద్దిల్ల  శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్  సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి  క్షేత్ర స్థాయిలో పర్యటించి  సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.

   ఈ సందర్భం గా ఏర్పాట్లకు సంబంధించి గ్రౌండ్ ఆవరణను కలియ తిరిగి పరిశీలించిన మంత్రులు ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును పరిశీలించి ఇలాంటి లోటుపాట్లు  లేకుండా సభకు వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా  పగడ్బందీ ఏర్పాట్లు ఉండాలన్నారు

  సభ ప్రాంగణంలో డ్వాక్రా ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను  ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన క్యాంటీన్  ఏర్పాట్లను ఈ సందర్భం గా మంత్రులు పరిశీలించారు

  ఇట్టి కార్యక్రమంలో  రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఐ అండ్ పి ఆర్ కమిషనర్ డాక్టర్ హరీష్ వరంగల్ పశ్చిమ  వర్ధన్నపేట శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద ప్రావీణ్య బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తాణాజీ వాకడే  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

     ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో  సంబంధించిన ఏర్పాట్లపై  హనుమకొండ ప్రధాన సమావేశ మందిరంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్  భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు  డాక్టర్ సత్య శారదా, దివాకరా టి.ఎస్., రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ,  సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, కుడా, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.  ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలు, జిల్లా సమైఖ్య సభ్యులు, గ్రామ సమైఖ్య సభ్యులకు వివిధ శాఖల వారీగా ఈ సందర్భంగా ఆస్తులను పంపిణీ  చేయనున్నారు. 

ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ అటవీ

శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు దిశానిర్థేశం చేశారు. వరంగల్‌ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల పై శుక్రవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూట్‌ మ్యాప్‌, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్‌ తదితర లాజిస్టిక్‌ అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను అందరం కలిసి దిగ్విజయం చేయాలని పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం గతేడాది కాలంలో చేపట్టిన  అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విజువల్స్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. 19న వరంగల్‌లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, ప్రజా పాలన విజయోత్సవ సభ గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఏడాది కాలంలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా నిలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శమని చెప్పారు. 

స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఐ అండ్ పీఆర్ హరీశ్, వరంగల్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

14న బాలల దినోత్సవం సందర్భంగా  ఆటో నగర్ లోని బాలుర పరిశీలక గృహము లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెహ్రూ  చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కేక్ కట్ చేపించి,

అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  తెలిసీ, తెలియని వయసులో చేసిన తప్పులు తిరిగి పునరావృతం చేయకుండా, చట్ట వ్యతిరేక పనులకు స్వస్తి చెప్పి, క్రమశిక్షణతో కూడుకున్న జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. మంచి మిత్రులతో సహవాసం చేయాలని, చెడు స్నేహం చేయరాదన్నారు. ఇకనైనా చట్టవ్యతిరేకమైన పనులను మానివేసి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకునేలా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా బాలుర పరిశీలక గృహంలో పరిసర ప్రాంతాలను, రిజిస్టర్ లను, ఆహార సరుకులను, రోజువారి ఆహార నియమావళిని, ఔషధాలను, సి.సి.కెమెరాలను తనిఖీ చేయడం జరిగింది. ఎల్లప్పుడూ పరిసరాలను, గదులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అని సిబ్బందికి సూచించారు. బాలురకు అందిస్తున్న వసతులు, ఆహార పదార్థాల నాణ్యత ను అడిగి తెలుసుకున్నారు.

ఎటువంటి సహాయ సహకారాలకైననూ బాలురు ఎవరైననూ న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి, తగిన సహాయం పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేష్, హోమ్ సూపరింటెండెంట్ వి. శ్రీదేవి,  జువైనల్ బోర్డు మెంబర్లు యం.సుభాష్, డా.గోపికా రాణి, హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

హనుమకొండలో   ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే  శుక్రవారం పరిశీలించారు.

హెలికాప్టర్ దిగనున్న ఆర్ట్స్ కళాశాల మైదానంతో పాటు బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రం, కాజీపేట ఆర్వోబీ ని కలెక్టర్లు , పోలీస్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పరిశీలించారు. 

సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, కుడా, మున్సిపల్, ఇతర శాఖల

 అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

హనుమకొండలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని C.H. రమేష్ బాబు, ప్రధాన న్యాయమూర్తి, హనుమకొండ గారు హంటర్ రోడ్లోని మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలో(గర్ల్స్) క్యాంపుకి హాజరు అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టీచర్స్, పిల్లలలో వ్యకిఅంతరా భేదాలను గుర్తించి వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ ఒక నేరము అని, ఎవరు ప్రోత్సహించరాదని చెప్పారు. స్కూల్ లో కానీ, ఇంటి వద్ద కానీ ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హనుమకొండని సంప్రదించాలని చెప్పారు. ఈ క్యాంపులో శ్రీమతి క్షమా దేష్పాండే సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హనుమకొండ మరియు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, రీజినల్ లెవెల్ కో-ఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హన్మకొండ ;

హనుమకొండ లో   అర్హత కలిగిన  వారిని ఓటర్లుగా నమోదు చేసుకునేలా చైతన్యవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. 

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపర్చడం, భాగస్వామ్యం చేయడం పై ముగ్గుల పోటీలను నిర్వహించారు. 

ఈ పోటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్ధినులు ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకునేలా ఓటు చైతన్యంపై ముగ్గులు వేశారు. 

విద్యార్థినులు ఓటరు చైతన్యం పై  వేసిన ముగ్గులను  అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముగ్గులతో పాటు వాటి చుట్టూ ఓటు హక్కు, దాని ప్రాముఖ్యతపై రాసిన వివరాలను విద్యార్థినులను కలెక్టర్ అడిగితెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటరు చైతన్య కార్యక్రమాలలో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహించినట్లు తెలిపారు.  విద్యార్థినులు ఓటరు చైతన్యంపై ఆకట్టుకునేలా ముగ్గులను వేశారని అన్నారు. ఆక అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు  ఓటు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు,  బంధువులు, చుట్టుపక్కలవారికి  తెలియజేయాలన్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు వేసేవిధంగా చైతన్యం తీసుకురావాల న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్బంగా స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం, నూతన ఓటర్ల నమోదుకు చేపడుతున్న కార్యక్రమాలను నోడల్ అధికారి శ్రీనివాస్ కుమార్ వివరించారు. 

ఓటరు చైతన్యం పై ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, డిప్యూటీ తహసీల్దార్లు విఠలేశ్వర్, శ్యామ్ కుమార్, ఇతర అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

హనుమకొండలో వయో వృద్ధులకు సంబంధించిన కేసుల పరిష్కారానికి నిర్ణీత  గడువులోగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. 

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం పరిధిలో వచ్చిన కేసుల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ వయో వృద్ధులకు సంబంధించిన కేసులను అధికారులు పరిష్కరించాలని అన్నారు. ట్రిబ్యునల్ లో నమోదైన కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కేసుల పరిష్కారంలో భాగంగా ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. వయోవృద్ధులకు సంబంధించిన కేసులను  జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆర్డీవోల పరిధిలో  ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. 

హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ రవికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

 హనుమకొండలో టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, పోలీస్, విద్య, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులతో గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ తేది 17 న ఉదయం 10.00 గంటల నుండి(పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు) మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష, సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్ష ( పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందన్నారు.

అదేవిధంగా 18 న ఉదయం 10. 00 గంటలనుండి    

మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష( పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందని కలెక్టర్ తెలిపారు. టిజిపిఎస్సి గ్రూప్ -3 పరీక్షలు సజావుగా,ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. 

అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. హనుమకొండ జిల్లాలో 33,456 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్3 పరీక్ష రాస్తున్నారని వీరి కోసం 83 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

అభ్యర్థులు (i) నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు (ii) పెన్సిల్ & ఎరేజర్ (i) హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో (iv) ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ID కార్డ్‌ని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలన్నారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే రాయాలన్నారు. సెల్ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు ఎలాంటి అంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరీక్ష కేంద్రాలు టేబుల్, చేర్స్ సానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఆర్టిసి. ఆర్.ఎం. ధరమ్ సింగ్, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హన్మకొండ ;

 అసంపూర్తిగా ఉన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబి) నిర్మాణ పనులను మార్చికల్లా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 

గురువారం కాజీపేట ఆర్వోబి వద్ద నిర్మాణ పనులకు సంబంధించి వచ్చిన గడ్డర్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఇతర అధికారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు.  

ఆర్వోబి నిర్మాణానికి సంబంధించిన మ్యాపును ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించి వాటిని గురించిన వివరాలను ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వోబి నిర్మాణానికి సంబంధించిన వివరాలను సంబంధిత గుత్తేదారుతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆగిపోయిన కాజీపేట ఆర్వోబి పనులకు జీవం పోశామని, మార్చి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామ న్నారు. ఇందుకు సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దృష్టికి తీసుకువెళ్లి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిర్మాణానికి సంబంధించిన సామగ్రి రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పది రోజుల్లోపు నిర్మాణ సామగ్రి మొత్తం రానుందన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి సమావేశాల్లోనూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే నిర్మాణ పనులు ప్రారంభించుకున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, తహసీల్దార్ బావ్ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.