హన్మకొండ ;
హనుమకొండలో టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, పోలీస్, విద్య, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులతో గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ తేది 17 న ఉదయం 10.00 గంటల నుండి(పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు) మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష, సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్ష ( పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందన్నారు.
అదేవిధంగా 18 న ఉదయం 10. 00 గంటలనుండి
మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష( పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందని కలెక్టర్ తెలిపారు. టిజిపిఎస్సి గ్రూప్ -3 పరీక్షలు సజావుగా,ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. హనుమకొండ జిల్లాలో 33,456 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్3 పరీక్ష రాస్తున్నారని వీరి కోసం 83 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అభ్యర్థులు (i) నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు (ii) పెన్సిల్ & ఎరేజర్ (i) హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో (iv) ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ID కార్డ్‌ని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలన్నారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే రాయాలన్నారు. సెల్ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు ఎలాంటి అంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరీక్ష కేంద్రాలు టేబుల్, చేర్స్ సానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఆర్టిసి. ఆర్.ఎం. ధరమ్ సింగ్, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: