హన్మకొండ ;
అసంపూర్తిగా ఉన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబి) నిర్మాణ పనులను మార్చికల్లా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
గురువారం కాజీపేట ఆర్వోబి వద్ద నిర్మాణ పనులకు సంబంధించి వచ్చిన గడ్డర్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఇతర అధికారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు.
ఆర్వోబి నిర్మాణానికి సంబంధించిన మ్యాపును ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించి వాటిని గురించిన వివరాలను ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వోబి నిర్మాణానికి సంబంధించిన వివరాలను సంబంధిత గుత్తేదారుతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆగిపోయిన కాజీపేట ఆర్వోబి పనులకు జీవం పోశామని, మార్చి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామ న్నారు. ఇందుకు సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దృష్టికి తీసుకువెళ్లి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిర్మాణానికి సంబంధించిన సామగ్రి రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పది రోజుల్లోపు నిర్మాణ సామగ్రి మొత్తం రానుందన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి సమావేశాల్లోనూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే నిర్మాణ పనులు ప్రారంభించుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, తహసీల్దార్ బావ్ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: