హన్మకొండ ;
హనుమకొండలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు.
హెలికాప్టర్ దిగనున్న ఆర్ట్స్ కళాశాల మైదానంతో పాటు బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రం, కాజీపేట ఆర్వోబీ ని కలెక్టర్లు , పోలీస్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పరిశీలించారు.
సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, కుడా, మున్సిపల్, ఇతర శాఖల
అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: