హన్మకొండ ;
ఇటీవల రాష్ట్ర స్థాయి కరాటే పోటీ లో వరంగల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినికి ద్వితీయ బహుమతి లభించింది. కృష్ణా కాలని వరంగల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.అనుష్క ఖమ్మం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీ లో ద్వితీయ బహుమతి లభించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ శరధృతి అభినందనలు తెలిపారు.శాలువాతో సన్మానం చేసి పూలగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల,ప్రవళిక,స్టాఫ్ సెక్రెటరీ శ్రీనివాసశర్మ, అధ్యాపకులు హరి కృష్ణ,డాక్టర్ కరుణ శ్రీ,షబానా,కవిత,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: