హన్మకొండ ;
ఈనెల 19 మంగళవారం రోజున వరంగల్ నగర పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యం లో సభా స్థలి ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీమతి కొండ సురేఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా ఏర్పాట్లకు సంబంధించి గ్రౌండ్ ఆవరణను కలియ తిరిగి పరిశీలించిన మంత్రులు ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును పరిశీలించి ఇలాంటి లోటుపాట్లు లేకుండా సభకు వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు ఉండాలన్నారు
సభ ప్రాంగణంలో డ్వాక్రా ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన క్యాంటీన్ ఏర్పాట్లను ఈ సందర్భం గా మంత్రులు పరిశీలించారు
ఇట్టి కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఐ అండ్ పి ఆర్ కమిషనర్ డాక్టర్ హరీష్ వరంగల్ పశ్చిమ వర్ధన్నపేట శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద ప్రావీణ్య బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తాణాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: