హన్మకొండ ;
సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )లో పేర్కొన్న అన్ని వివరాలను ఎన్యుమరేటర్ సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు జాగ్రత్తగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల ను ఎన్యుమరేటర్ల సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే వివరాలను నమోదు చేస్తున్నారని, ఇప్పుడు వరకు ఎన్ని పూర్తి చేశారని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ సర్వే వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా పకడ్బందీగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేయాలన్నారు. ఇచ్చిన సర్వే వివరాలతో కూడిన పత్రాలు, ఆన్లైన్లో నమోదు చేసిన వాటి సంఖ్యను సరిచూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: