హన్మకొండ ;
వరంగల్ కృష్ణా కాలని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ గా బి.సహస్ర(ద్వితీయ బిపిసి),అధ్యాపకులు గా సోని,ముస్కాన్,లక్షయ,శ్రీ హర్షిణి,సిరిచందన,హరిణి,
ఆకాంక్ష,హంసిక,కీర్తన,అర్ష,హారిక,ఆయేషా,హర్షిత,షాజియా ఫాతిమా, శ్రావ్య,ముస్కాన్,రిషిక,ఆఫ్రీన్,చైతన్య, లైబ్రరియన్ ఆయేషా,పీడి గా అనుష్క,ఆఫీసు సబార్డినేట్ గా సౌమ్య వ్యవహరించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు తరగతులు నిర్వహించారు. అధ్యాపకులు శ్రీనివాసశర్మ,కొమురారెడ్డి,
హరికృష్ణ,డాక్టర్ కరుణ శ్రీ,లైబ్రరియన్ వనమాల జడ్జి లుగా బోధన నిర్వహణ తీరును పరిశీలించి ప్రథమ,ద్వితీయ,తృతీయ అధ్యాపకులుగా విజేతలుగా నిర్ణయించారు. ఏ.లక్షయ,టి.హరిణి ప్రథమ,సోని ద్వితీయ,ఆఫ్రీన్ తృతీయ విజేతలు గా ప్రకటించారు. కళాశాల ప్రిన్సిపాల్ శరదృతి ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
**ఎస్ ఆర్ రంగనాథన్ కు ఘన నివాళి ..**
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గురువారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కృష్ణా కాలని వరంగల్ లో ఎస్ ఆర్ రంగనాథన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వ్యాస రచన,వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని లైబ్రరియన్ వనమాల తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరధృతి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారి వనమాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Post A Comment: