ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ఘనపురం మండల కేంద్రంలో పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి ఎస్పి కిరణ్ ఖరే గురువారం ప్రారంభించారు. గతంలో చిట్యాల సర్కిల్ లో ఘనపురం, రేగొండ ఉండేది. నూతంగా కొత్తపల్లి గోరి పోలీసు స్టేషన్ ఏర్పాటుతో ఘనపురం, రేగొండ, కొత్తపల్లి గోరిని నూతన పోలీసు సర్కిల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్‌గా సిహెచ్ .కరుణాకర్ రావును జిల్లా ఎస్పీ నియమించారు. దీంతో ఘనపురం పోలీస్ స్టేషన్ పై అంతస్తులో నూతన సర్కిల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ పూజలు చేసి, కార్యాలయాన్ని ప్రారంభించి, సిఐ కరుణాకర్ రావును అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే ,ఎస్పీ మాట్లాడుతూ ఘనపురం జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తతకూడదని, పరిపాలన సౌలభ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నూతన సర్కిల్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నరేష్ కుమార్ భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ మల్లేష్, , ఎస్సై అశోక్, గణపురం ఎమ్మార్వో, ఎంపీడీవో ఘనపురం మండల రాజకీయ నాయకులు, ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: