ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలోనీ వ్యాపార సముదాయాలు మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వివిధ వ్యాపార సంస్థలు, జెన్కో సహకారంతో ఏర్పాటు చేసిన 160 సీసీ కెమెరాలను ఎస్పీ కిరణ్ ఖరే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, జెన్కో, జిల్లా కేంద్రంలోని వివిధ వ్యాపార వాణిజ్య, మరియు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
నేరాలను తక్షణమే పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. భూపాలపల్లి జిల్లాలో గతంలో ఉన్న సీసిటీవీ కెమెరాస్ కన్నా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేశామని, రేగొండ నుంచి కాళేశ్వరం వరకు నిఘా నేత్రం ద్వారా నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలనీ ఎస్పీ కోరారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ
నేరాల అదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మిస్టరీ కేసులను చేధించటంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పట్టణంలోనే కాదు గ్రామాల్లో సైతం నేరాల కట్టడికి సీసీ కెమేరాలు వినియోగించాలన్నారు. జిల్లా కేంద్రంలో దొంగతనాలు జరుగుతున్నాయని, నేరాలను అరికట్టడానికి సిసి కెమెరాలు చాలా ముఖ్యమని, ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు అరికట్టడం తొందరగా జరుగుతుందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీస్ శాఖకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. నాయకులు వ్యాపారవేత్తలు దాతలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేష్ కుమార్, సింగరేణి జిఎం రాజేశ్వరావు, పట్టణ ఛాంబర్ అఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాంచంద్రరావు, డాక్టర్.కిరణ్, డిఎస్పీ సంపత్ రావు, సిఐనరేష్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
Post A Comment: