ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ లష్కర్ సింగారంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు ఎంతమందిని పరీక్షించారు, EHMIS ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసిన వివరాలను కలెక్టర్ వైద్యాధికారి డాక్టర్ హైదర్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ- ఔషదీ పోర్టల్ లో నమోదు చేసిన మందుల వివరాలను , సెంట్రల్ మెడికల్ స్టోర్ నుంచి అందుకున్న మందుల వివరాలను, ఇష్యూ చేసిన వివరాలను అలాగే స్టోర్ లో నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. టీబీ ముక్త్ అభియాన్ లో ఎంత మందిని పరీక్షించారు , ఏ ఏ హై రిస్క్ గ్రూపుల వారిని పరీక్షించారు, వారి వివరాల నమోదు,phc లో నమోదు చేసిన గర్భిణీ ల వివరాలు,NCD లో బిపీ,షుగర్ నిర్ధారణ, మందుల పంపిణీ , ఫాలో అప్ వివరాలను పరిశీలించారు.టీబీ హై రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్ ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని వైద్యాధికారి, వైద్యులకు సూచించారు.
నమోదైనటువంటి గర్భిణీ స్త్రీలకు ఏ సేవలు అందిస్తున్నారు ,అలాగే ప్రసవానంతర సేవలను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫీవర్ సర్వే నిర్వహించాలని,డ్రై డే కార్యక్రమం పట్ల ప్రజలకు భాగస్వాములను చేస్తూ అవగాహన కలిగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హైదర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: