సెప్టెంబర్ 1, 2004 తర్వాత అమలు పరుస్తున్న ఉద్యోగ,ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు అమలు పరచాలని సెప్టెంబర్ 1 న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద PRTUTS ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా పోస్టర్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటారం కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేని, కాంట్రిబ్యూట్ లేని విధంగా , 30 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగికి ,ఉద్యోగ విరమణ అనంతరం ఎలాంటి అస్సూరెన్స్ లేకుండా ఉన్నటువంటి, షేర్ మార్కెట్ పెట్టుబడుల పై ఆధారపడిన ,స్థిరమైన పెన్షన్ లేని లోపభూయిష్టమైన ఈ అసంబద్ధమైన పెన్షన్ విధానాన్ని ,
రద్దు చేయాలనీ అలాగే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో CPS రద్దు చేస్తామని చెప్పిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే CPS ను రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు పరచాలని ,పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదని,అది ఉద్యోగి హక్క అని 1982 లోనే సుప్రీం కొర్టు పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని తెల్పిందని తెలిపారు.
ఈ పెన్షన్ విద్రోహ దినం Sep 1 PRTUTS చేపట్టే మహాధర్నా లో ప్రతి CPS ఉపాధ్యాయుడు తమ బాధ్యతగా కచ్చితంగా పాల్గొని ,మహాధర్నా ను విజయవంతం చేసి ప్రభుత్వానికి మన పోరాట స్ఫూర్తిని తెలియచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTUTS కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు A. రవీందర్, A. తిరుపతి , సంఘ సీనియర్ నాయకులు N. సురేష్ రావు, T. సంపత్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: