ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శిరీష్ సోమవారం సందర్శించారు.
హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
సోమవారం హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వస్తున్న ఓపి, ఐపీ సేవలు, డెలివరీ కేసుల గురించిన వివరాలను వైద్యాధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూమ్ ను పరిశీలించి ఎంతమంది వైద్యులు సిబ్బంది, షిఫ్టుల వారిగా విధులు నిర్వర్తిస్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ కేసులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తారని, డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు డిశ్చార్జ్ చేస్తారని, సెక్షన్ ఆపరేషన్లు, హై రిస్క్ కేసుల ట్రీట్మెంట్ గురించి కలెక్టర్ ఆరా తీశారు. అదేవిధంగా ఎక్స్ రే యూనిట్ ను పరిశీలించారు. పలు వార్డులను సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి బాలింతలు, గర్భిణీలతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలకు వైద్యులు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. హై రిస్క్ కేసులకు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకునే విధంగా, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించేలా వైద్యులు సలహాలు సూచనలు చేయాలన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఇతర వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: