హన్మకొండ ;

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పర్యాటక ప్రదేశాల విశిష్టతను, అవగాహన కల్పించేందుకు తెలంగాణ దర్శిని ద్వారా పర్యాటక ప్రాంతాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. 

జాతీయ బాలల దినోత్సవం నేపథ్యంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ప్రభుత్వ మర్కజి పాఠశాల విద్యార్థులకు పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళ్లే బస్సును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 

పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లేందుకు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సును కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు బస్సులో కూర్చుండగా వారితో కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా యువ టూరిజం క్లబ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శన విద్యార్థులకు ఎంతో అవసరం అని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటక, వారసత్వ సంపద, సాంస్కృతిక గురించి విద్యార్థులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వలన వాటి సాంస్కృతిక, వారసత్వ సంపద ప్రాముఖ్యతను తెలుసుకుంటారని, దీనివల్ల అవగాహన పెంపొందుతుందన్నారు.  

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన యువ టూరిజం క్లబ్ ద్వారా పాఠశాల విద్యార్థులు ఖిలా వరంగల్, కుష్ మహల్, పురావస్తు శాఖ మ్యూజియం, భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాలను సందర్శిస్తారని, వీటిని గైడ్ ద్వారా విద్యార్థులకు వివరిస్తారని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రానున్న రోజుల్లో అన్ని పాఠశాలలకు, కళాశాలలకు ఇలాంటి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: