హన్మకొండ ;
సివిల్ వివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన 18 మంది నుంచి ఎస్పి పిర్యాదులు స్వీకరించి, వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచరాదని వాటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.
Post A Comment: