హన్మకొండ ;
ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కరదీపికను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ కరదీపిక వైద్యాధికారులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అలాగే ప్లానింగ్ మరియు సిబ్బందికి శిక్షణ అందించేందుకు ఉపయోగపడుతుంది అన్నారు .అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ,జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ ,డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎ అప్పయ్య ,డిఆర్డిఓ మేన శ్రీను ,జిల్లా పరిషత్ సీఈవో విద్యుల్లత,హనుమకొండ పరకాల ఆర్డీవోలు శ్రీ నారాయణ , రమేష్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి వాసంతి,జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జయంతి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: