హన్మకొండ ;
తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007పై హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, హెల్ప్ ఏజ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే హాజరై మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సేవలను అందిస్తుందని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అదరపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ సంబంధిత కార్యాలయాలన్నింటిలోనూ వృద్ధులకు ప్రత్యేక సేవలను అందించాలని అన్నారు. కార్యాలయాలకు వచ్చే వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్వర సేవలందించాలని పేర్కొన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో వయోవృద్ధుల చట్టంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వయోవృద్ధులను వారి పిల్లలు, కుటుంబీకులు పట్టించుకోనట్లయితే రెవెన్యూ డివిజనల్ ఆధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ అధికారి శ్యాం కుమార్, ఎఫ్ఆర్వో రవికృష్ణ, ఇతర జిల్లా అధికారులతో పాటు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణ్యపురి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: