హన్మకొండ ;
హనుమకొండ లో అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేసుకునేలా చైతన్యవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపర్చడం, భాగస్వామ్యం చేయడం పై ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్ధినులు ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకునేలా ఓటు చైతన్యంపై ముగ్గులు వేశారు.
విద్యార్థినులు ఓటరు చైతన్యం పై వేసిన ముగ్గులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముగ్గులతో పాటు వాటి చుట్టూ ఓటు హక్కు, దాని ప్రాముఖ్యతపై రాసిన వివరాలను విద్యార్థినులను కలెక్టర్ అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటరు చైతన్య కార్యక్రమాలలో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థినులు ఓటరు చైతన్యంపై ఆకట్టుకునేలా ముగ్గులను వేశారని అన్నారు. ఆక అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఓటు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కలవారికి తెలియజేయాలన్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు వేసేవిధంగా చైతన్యం తీసుకురావాల న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం, నూతన ఓటర్ల నమోదుకు చేపడుతున్న కార్యక్రమాలను నోడల్ అధికారి శ్రీనివాస్ కుమార్ వివరించారు.
ఓటరు చైతన్యం పై ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, డిప్యూటీ తహసీల్దార్లు విఠలేశ్వర్, శ్యామ్ కుమార్, ఇతర అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
Post A Comment: