హన్మకొండ ;
జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి పరిధిలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి ధాన్యానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులను, ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలను నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎంత ధాన్యం వస్తుందని వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. 40కి పైగా మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, పౌరసరఫరాల శాఖ మేనేజర్ మహేందర్, ఏడిఏ లక్ష్మీనారాయణ, ఏవో పద్మ, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: