హన్మకొండ ;
పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పి ఘనపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులు, విధుల నిర్వహణ, పరిష్కారం, పోలీస్ స్టేషన్లోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నియంత్రణకు సంబంధించిన చర్యల గురించి ఎస్సై అశోక్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని పెండింగ్ కేసులు, రికార్డులు మరియు రికార్డ్ రూమ్, రైటర్ రూమ్, లాకప్ రూం వివిధ విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ఎస్పి మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మండలంలో ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పి కిరణ్ ఖరే ఆదేశించారు. అంతకు ముందు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఘనపురం మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరాల పనితీరు, బ్యాంకుకు సంబందించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, బ్యాంక్ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేశ్ ఘనపురం ఎస్సై ఆర్. అశోక్, సీసీ ఫసియుద్దిన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: