హన్మకొండ ;
ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఈ క్రమంలో పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషి పెయింటింగ్స్ అండ్ మాస్క్స్, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు, తదితర స్టాళ్లను పర్యవేక్షించి, ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను, వారు చేస్తున్న బిజినెస్ లా గురించి , టార్నోవర్ తదితర వివరాలను స్టాళ్ల నిర్వాహకులను ముఖ్య మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క),
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ శాంత కుమారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి,వరంగల్ ఎంపీ కావ్య,బలరాం నాయక్,శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి,యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ లు బస్వారాజు సారయ్య, తీన్మార్ మల్లన్న,వరంగల్, హన్మకొండ కలెక్టర్ లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: