హన్మకొండ ;  కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఫౌండేషన్ కార్యదర్శి వి. ఆర్. విద్యార్థి అధ్యక్షతన కవి సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల కాలంగా వరంగల్ కవిలోకం ఎదురుచూస్తున్నటువంటి వేదిక కాళోజీ కళాక్షేత్రంను ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని, ఈ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ తరుపున ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది' అంటూ జీవితమంతా సమాజం కోసం అంకితం చేసిన మహా వ్యక్తి, శక్తి కాళోజీ అని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ వరంగల్ కవిలోకం ఎదురుచూసిన కల ఆవిష్కృతమైందని కవులు, రచయితలు, కళాకారులు వరంగల్ ను గొప్ప సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి బిల్ల మహేందర్ ఆహ్వానంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంకు అతిథులుగా ఆచార్య బన్న అయిలయ్య, అనిశెట్టి రజిత, ముహమ్మద్ సిరాజుద్దీన్, సీతాల రాఘవేందర్, డిపీఆర్ఓ  భానుప్రకాశ్ లతో పాటు కవులు నెల్లుట్ల రమాదేవి, అంజనీదేవి, చింతల కమల, దేవులపల్లి వాణి,  మాధారపు వాణిశ్రీ, అన్వర్ , తాడిచర్ల రవి, కుమార్ , పల్లేరు వీరస్వామి, కార్తీకరాజు, జితెందర్, మహ్మద్ గుల్షన్ , ఉమ, రమాదేవి, వందన, రాజమోహన్ , వకులవాసు, హాజీనూరానీ, శంకర్ నారాయణ, అనిత, విద్యాదేవి, పెద్ది వెంకటయ్య,, మస్నా వెంకటేశ్వర్లు, వి.రవికుమార్ , వలబోజు రాంబ్రహ్మచారి, బూర భిక్షపతి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: