పెద్దపల్లి, (  మేడిగడ్డ టీవీ న్యూస్ ) ముస్త్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..రైతులకు మద్దతు ధర కోసమే ఊరూరా ఐకెపి సెంటర్లు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని కమాన్పూర్ మండల ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను శుక్రవారం ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యంను నేరుగా ఐకేపీ సెంటర్కు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.మధ్య దళారులను నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు.నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించినట్లు తెలిపారు.ఐకేపీ సెంటరుకు ధాన్యంను తీసుకవచ్చే రైతులకు కనీస సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.ఆలస్యం చేయకుండా త్వరితగతిన ధాన్యంను తూకం వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకర మహేందర్,ఉపసర్పంచ్ బాసినేని వినోద రావు,వ్యవసాయ అధికారి మౌనిక,సీసీ బాబు,సెక్రెటరీ హసీనా నిషాత్,వార్డు సభ్యులు నీలం శ్రీను.సుందిళ్ల శారదతోపాటు రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: