భూపాలపల్లి జిల్లా: తీన్మార్ మల్లన్న చేపడుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ శక్తులు ఆయనపై దాడులకు కుట్రలు చేస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆరోపించారు. శుక్రవారం పాదయాత్ర సందర్భంగా మల్లన్న ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనాన్ని లారీతో ఢీకొట్టే ప్రయత్నం జరిగిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, బీసీల హక్కుల కోసం మల్లన్న 51 రోజులుగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని, ఆయనను బెదిరింపులతో అడ్డుకోలేరని అన్నారు. బీసీల విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ వాటా కోసం సాగుతున్న ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు.

మల్లన్నకు ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, తెలంగాణ డీజీపీ వెంటనే స్పందించి ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి కుట్రకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, యువజన విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, అధికార ప్రతినిధి మడే సంతోష్, కోశాధికారి జినుకల శ్రీను, జిల్లా కోఆర్డినేటర్ మోటపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు జిలకల అశోక్, గట్టు శ్రీకాంత్, రోడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: