ఈ సందర్భంగా గర్భధారణకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఐదు పశువులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అదేవిధంగా 60 నుంచి 70 పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్సలు చేయగా, మరో 15 పశువులకు సాధారణ వైద్య సేవలు అందించారు.
పశువుల్లో గర్భకోశ, పునరుత్పత్తి సమస్యలను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని డాక్టర్ జి. రమేష్ తెలిపారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ మిత్ర సూపర్వైజర్ ప్రకాశ్ రెడ్డి, గోపాల్ మిత్ర శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్లు కిసాన్, రాజశేఖర్, ఎల్.ఎస్.ఏ. రాజేందర్, గ్రామ సర్పంచ్, రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.

Post A Comment: