పలిమెల, ( మేడిగడ్డ టీవీ న్యూస్ ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని మోదేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున 5:30 నుంచి 7:30 గంటల వరకు పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ ఎన్. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, పలిమెల ఎస్‌ఐ టి. సాయి శశాంక్ ఆధ్వర్యంలో సివిల్ పోలీస్, టీజీఎస్పీ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఇంటింటా సోదాలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే గ్రామంలో వాహనాలను తనిఖీ చేసి, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.

గుడుంబా తయారీ, విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: