కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక కోల శాన్వి ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించింది. తెలంగాణ యోగా అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కోల జయసుధ–దుర్గరాజ్ దంపతుల కుమార్తె కోల శాన్వి అండర్‌–8 నుంచి 10 సంవత్సరాల విభాగంలో పాల్గొంది. పోటీల్లో అద్భుతమైన యోగాసనాలను ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. చిన్న వయసులోనే జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం పట్ల బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన బాలిక జిల్లా స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా కోచ్ వవిల్ల కిష్టయ్య కోల శాన్విని అభినందించారు. కాగా, ఈ నెల 11న కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు శాన్వి ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: