భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కోశాధికారి జినుకల శ్రీను భార్య దివ్య కుటుంబాన్ని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జిల్లా నాయకులతో కలిసి పరామర్శించారు. తలలో కణితితో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దివ్య మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఇద్దరు కుమార్తెల చదువులకు భవిష్యత్తులో సహకరిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జినుకల శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలను త్వరలో కలసి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు, కమలాపూర్ గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: