భూపాలపల్లి, ఆగస్టు 20: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంపై ఈ నెల 23న హనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ చర్చ వేదికను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. గురువారం భూపాలపల్లిలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బహిరంగ చర్చ వేదిక కనపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కె. కేశవరావు చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హనుమకొండ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ వేదిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాచమౌని నాగభూషణం అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములునాయక్, ఉద్యమకారుల కమిటీ సభ్యుడు శోభన్‌రెడ్డి, ప్రొఫెసర్ చింతకింది కాసిం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొంటారని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర గట్టయ్య, టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ పార్వతి, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఐత బాపు, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: