కాటారం, ఆగస్టు 19: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు పేద లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ అన్నారు. నిబంధనలు సవరించకపోతే లబ్ధిదారుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం ప్రస్తుత నిర్మాణ ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. సిమెంట్, ఇనుము, కూలీల ధరలు పెరిగిన నేపథ్యంలో నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటి వైశాల్య పరిమితిని 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. అరకొర ఆర్థిక సాయంతో పేదలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పీక కిరణ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి నిబంధనలు సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Post A Comment: