కాటారం, జూన్ 05: కాటారం పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు భారీగా లీకై వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండాకాలంలో అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు విలువైన తాగునీరు గంటల తరబడి రోడ్లపై పారిపోతున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు లీకేజీని మరమ్మతు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Post A Comment: