కాటారం, జూన్ 5: ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతాపగిరి గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా మొక్కల నాటకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటారం అటవీ క్షేత్ర అధికారి మరియు అటవీ శాఖ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ, విద్యుత్ తీగలు మరియు ఉచ్చులు ఏర్పాటు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అక్రమ అటవీ నరికివేతలు మరియు ఆక్రమణలను అరికట్టే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో హెచ్. సురేందర్ (డీఆర్‌వో, కాటారం సెక్షన్), డి. ఝాన్సీ రాణి (డీఆర్‌వో, యామన్‌పెల్లి సెక్షన్), పి. చంద్రశేఖర్ (ఎఫ్‌ఎస్‌వో, దామరకుంట సెక్షన్), పి. సోనీ కిరణ్ (ఎఫ్‌ఎస్‌వో, చింతకాని సెక్షన్), కాటారం రేంజ్ బీట్ అధికారులు రాజేందర్, సంజీవ్, మొయినుద్దీన్, హరీష్, మోనా కౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది మల్లేష్, రేంజ్ జీపు డ్రైవర్ మహమూద్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: