జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు మరియు విద్య ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న “బడి బడి బాట” కార్యక్రమంలో దేవరాంపల్లి గ్రామ ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ వీధులు, కాలనీలలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి బాలబాలిక విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రయత్నాలను అభినందించి, పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. “ప్రతి చిన్నారి బడిబాట – విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు” అనే నినాదంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: