నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన యువకుడు జాదవ్ మాధవరావ్ దేశవ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, కుబీర్ గ్రామానికి చెందిన జాదవ్ మాధవరావ్, గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను ప్రారంభించారు. అలాగే నరేంద్ర మోదీ గారు నాలుగోసారి ప్రధానమంత్రి కావాలని, అఖండ భారత్ నిర్మాణం జరగాలని సంకల్పంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు, బడా చార్ ధామ్, చోటా చార్ ధామ్ యాత్రలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగే ఈ యాత్రలో సుమారు 15 వేల కిలోమీటర్లు నడవనున్నట్లు తెలిపారు. మే 11, 2026న ప్రారంభమైన ఈ పాదయాత్రకు ఇప్పటివరకు 22 రోజులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పటివరకు కేవలం 10 రోజుల పాటు మాత్రమే నడవగలిగానని వెల్లడించారు. ఇవాళ ఉదయం 5:30 గంటలకు మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాత్రికి ఆసిరవెల్లి లేదా అంకిసా గ్రామంలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందన్నారు. సిరోంచాలో గంగా స్నానం చేసిన అనంతరం అక్కడి విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని, బస, భోజనం వంటి అవసరాలను స్థానికులే స్వచ్ఛందంగా సమకూరుస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా వారు తిరస్కరిస్తూ సేవాభావంతో సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. “జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతా కీ జై” అంటూ తన యాత్రను కొనసాగిస్తున్న జాదవ్ మాధవరావ్‌కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.
Home
Telangana( తెలంగాణ )
గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలనే సంకల్పంతో మహా పాదయాత్ర చేస్తున్న జాదవ్ మాధవరావ్


Post A Comment: