జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జూన్ 2: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి సాధించే దిశగా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. కేవలం భౌగోళిక తెలంగాణతో సరిపెట్టకుండా, సామాజిక తెలంగాణ సాధించే వరకు టీఆర్పీ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంపల్లి గ్రామానికి చెందిన నడిగొట్టు కావ్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి తమ సానుభూతిని తెలియజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన శ్రీపతి జశ్వంత్ ఇటీవల చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి టీఆర్పీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాచారం గ్రామానికి చెందిన చీద్రాల మల్లమ్మ ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా కాసింపల్లి గ్రామానికి చెందిన మేకల సంపత్ తల్లి మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు గండు కరుణాకర్, ఇనుగాల ప్రణీత్, మామిడి శ్రీకాంత్, శ్రీపతి భద్రయ్య తదితరులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Post A Comment: