జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సైనికులు ప్రజల మధ్యకు వెళ్లి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభ్యున్నతి కోసం బలమైన బహుజన శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతోందని తెలిపారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే బలమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుండాలని రవి పటేల్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపు


Post A Comment: