భూపాలపల్లి, మే 26: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ(ఎంఎల్) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదాల కారణంగా అరటి తోటలు, మిరప, మొక్కజొన్న తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల పంట నష్టాల వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేపాకపల్లె దంపతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదాల నివారణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బంధు క్రాంతి, సుజాత, ఆత్కూరి శ్రీకాంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: