మహాదేవపూర్, మే 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ శివారులో ఉన్న ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రమాదంలో గెస్ట్ హౌస్‌తో పాటు అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, ఇతర విలువైన సామగ్రి, సిబ్బందికి చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గెస్ట్ హౌస్ ఇన్‌చార్జ్ తపాస్ కుమార్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అగ్నిప్రమాదంలో జరిగిన మొత్తం నష్టం సుమారు రూ.1,48,11,795 (ఒక కోటి నలభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు)గా అంచనా వేశారు. సమాచారం అందుకున్న మహాదేవపూర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మహాదేవపూర్ ఎస్‌ఐ కె. పవన్ కుమార్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: