హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి, ఈడిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ ఈడిగ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా గౌడ, ఈడిగ ఉద్యోగులు మరియు సంప్రదాయ వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. గౌడ, ఈడిగ వర్గాల ఆర్థిక, సామాజిక పురోగతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్, జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ పాల్గొన్నారు.

Post A Comment: