August 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 



హన్మకొండ ;

రాబోయే ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌  సిక్త పట్నాయక్ అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్‌  లో సీపీ రంగనాధ్ తో కలిసి కలెక్టర్ సెక్టోరల్‌, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి 42మంది సెక్టోరల్‌ అధికారులను నియమించామని, తెలిపారు  ఎన్నికల నిర్వహణ లో సెక్టర్ అధికారుల విధులు చాలా ప్రాముఖ్యతతో ఉంటాయని, ఇప్పటి వరకు అనేక ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా, ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ నుండి వచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ రాబోయే ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సమాయత్తం కావాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ నిర్వహణకు ముందు సెక్టార్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ పరిశీలించాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పన పరిశీలించాలని, నూతన పోలింగ్ కేంద్రాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, ఎంసిసి నిబంధన ఉల్లంఘన పై నిఘా ఉంచాలని,  తెలిపారు. పోలింగ్ కు ముందు నిర్వహించే ఓటరు సవరణ షెడ్యూల్ పై ప్రస్తుత ప్రచారం నిర్వహించాలని, అధికారి వద్ద ఉన్న ఓటర్ జాబితాలో పేర్లు చూసుకునే విధంగా ఓటర్లకు సమాచారం అందించాలని, ఈవిఎం వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని, తెలిపారు.





సీపీ రంగనాథ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎటువంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలనీ, ఒకటికి రెండు సార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని  తెలిపారు.





ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మహేందర్ ఆర్డీఓ లు రమేష్ కుమార్, శ్రీనివాస్ ఇండస్ట్రీస్ జిఎం  హరిప్రసాద్  పోలీస్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని అనేక కాలనీలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ  ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అధికారులతోని ఎప్పటికప్పుడు చర్చలు జరిపి  పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు కేటీ రామారావు  సహకారంతో  ఎప్పటికప్పుడు నగరాభివృద్ధికి కావలసిన  నిధులను తీసుకువచ్చి నగర అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం 67 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు అందరితో కలిసి పలు సమస్యల పైన చర్చించి, 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్డు వెడల్పు, డ్రైనేజీ సమస్యను వడ్డేపల్లి పరిసర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి,  కొంత గ్రామీణ వాతావరణం ఉంటుంది కాబట్టి నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పెరుగుతున్న  జనాభాకు అనుకూలంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో కొత్త కాలనీలతో పాటు కొత్త సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశగా నియోజకవర్గంలో కొన్ని వేలకోట్లతో ఇప్పటికే అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 60 డివిజన్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం,  డ్రైనేజీ సమస్య ఇతర సమస్యల పరిష్కారం కోసము మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా మరియు సిపి తో  పర్యసించడం జరిగిందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని అన్నారు.  సంక్షేమ పథకాలు పొందినటువంటి వారు పలువురికి చెప్పి  రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని అన్నారు. పదేళ్ల  కాలంలో  ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరొక్కసారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్,డివిజన్ అధ్యక్షులు రామరాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

కాళోజీ క‌ళాక్షేత్రాన్ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంద‌ని, ప‌నులు స‌కాలంలో నాణ్య‌త‌తో పూర్తి చేయాల‌ని కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్ అన్నారు.  కాళోజీ ప‌నుల‌ను శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌, కుడా వైస్ చైర్మ‌న్‌, మున్సిప‌ల్‌ క‌మిష‌న‌ర్ షేక్ రిజ్వాన్ బాషాతో క‌లిసి ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా కాళోజీ కళాక్షేత్రం ప‌నుల్లో వేగం పెంచాల‌ని కుడా అధికారుల‌కు, కాంట్రాక్ట‌ర్ల‌కు సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. కాళోజీ క‌ళాక్షేత్రం నిర్మాణంలో కేసీఆర్‌, కాళోజీ మిత్ర‌మండ‌లి వారి స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఆడిటోరియం, ఎంట్రెన్స్, సౌండ్ సిస్టం, సీటింగ్ పనుల్లో ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పనులను విభజించుకొని, సకాలంలో పూర్తి చేయాల‌ని అన్నారు. కార్యక్రమంలో సిపిఓ అజిత్ రెడ్డి, ఈ ఈ భీమ్రావ్, కాళోజీ ఫౌండేషన్ స‌భ్యులు ఎన్నార్  విద్యార్థి శ్రీ‌నివాస్ రావు, , కుడా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి 



*చంద్రయాన్ 3 విజయంతో వెల్లువెరిసిన ఆనందం

స్థానిక రామగుండంలోని క్రియేటివ్ ట్యుటోరియల్స్ విద్యార్థిని విద్యార్థులు

*చంద్రయాన్ 3 విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తూ త్రివర్ణ ప్రతాకాలను పట్టుకొని జయ జయ ద్వనులు చేశారు.

*శాస్త్ర పరిశోధనల వలన విజ్ఞానాభివృద్ధి మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా క్రియేటివ్ ట్యుటోరియల్స్ మాస్టర్ కన్నూరి లక్ష్మణరావు విద్యార్థిని విద్యార్థులకు తెలియచేస్తూ మీరు కూడా శాస్త్ర విజ్ఞాన పరిధి పట్ల మక్కువ పెంచుకొని మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు దేశానికి పేరు తీసుకువస్తూ సమాజ సేవ చేయాలని తెలిపారు

విద్యార్థిని విద్యార్థులు జైహింద్ జై భారత్ అంటూ నిదానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

న‌గ‌రం ముంపు బారిన‌ప‌డ‌కుండా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ , ప‌శ్చిమ శాస‌న‌స‌భ్యులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ అన్నారు. గ్రేట‌ర్‌లోని 31వ డివిజ‌న్ న్యూ శాయంపేట‌లో ఆయ‌న కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ , క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌, క‌మిష‌న్ షేక్ రిజ్వాన్ బాషా, స్థానిక కార్పొరేట‌ర్‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ ఇటీవ‌ల భారీ వ‌ర్షాల‌కు న‌గ‌రం ముంపు బారిన‌ప‌డిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నిబ‌ద్ధ‌త‌తో ఉంద‌ని అన్నారు. నాలాల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తున్నామ‌ని, నాలాలు ఆక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌కుండా జీడ‌బ్యూఎంసీ ఆధ్వ‌ర్యంలో చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. న్యూశాయంపేట ప‌రిధిలో కాల‌నీలు ఇటీవ‌ల నీట మున‌గ‌గా ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నాలాల‌పై నిర్మాణాల‌ను తొలిగించాల‌ని సూచించారు. మొస‌ళ్లు, కాల‌నీల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు సూచించారు. అనంత‌రం భ‌ద్ర‌కాళీ చెరువులోకి వెళ్తున్న న్యూ శాయంపేట నాలా ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. నాలాల పూడిక‌తీత‌, విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో అధికారులు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ‌లో క‌వుల‌కు, క‌ళాకారుల‌కు ప్ర‌ముఖ స్థానం ఉంద‌ని, మ‌రీ ముఖ్యంగా ఓరుగ‌ల్లు క‌ళ‌ల‌కు కేంద్రమ‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ , ప‌శ్చిమ శాస‌న‌స‌భ్యులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ అన్నారు. కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్‌, క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ తో క‌లిసి జైన్ టెంపుల్‌, స‌రిగ‌మ పార్కును చీఫ్ విప్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మంలో క‌వులు, క‌ళాకారుల‌ది కీల‌క భూమిక అని అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి క‌వుల‌పై , క‌ళాకారుల‌పై అమిత‌మైన గౌర‌వం అని, అందుకే క‌వుల‌కు, క‌ళాకారుల‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ళాకారుల కోసం ముఖ్య‌మంత్రి గారు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రూ.75 కోట్ల తో కాళోజీ కళాక్షేత్రం ఇప్ప‌టికే నిర్మించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఉల్లాసాన్ని క‌ల్పించేందుకు ఇప్పిటికే భ‌ద్ర‌కాళీ బండ్‌, ప‌బ్లిక్ గార్డెన్, డివిజ‌న్ల‌లో పార్కుల ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. రానున్న రోజుల్లో న‌గ‌ర వాసుల‌కు ఉల్లాసాన్ని క‌ల్పించేందుకు స‌రిగ‌మ పార్కును సైతం అందుబాటులోకి తెస్తామ‌ని అన్నారు. స‌రిగ‌మ పార్కును కుడా, మున్సిపాలిటీ ఆధ్వ‌ర్యంలో మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, క‌ళాకారుల‌కే నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను క‌ళా సంఘాల‌కు త్వ‌ర‌లో అప్ప‌గిస్తామ‌ని తెలిపారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ల‌క్ష్యంగా ముందుకు సాగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్, కార్పొరేట‌ర్లు అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని రెండవ సారి  ప్రకటించిన సందర్భంగా శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని కలిసి   కుడా మాజీ  చేర్మెన్ మర్రి యాదవ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42వ డివిజన్  రంగశాయిపేటను అభివృద్ధిలో ముందు ఉంచుతామని   ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.

నేడు రంగశాయిపేటలో 2కోట్ల95లక్షలతో నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా రంగశాయిపేట కవిచర్ల క్రాస్ వద్దనున్న ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకొని గీత కార్మికులు సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

నేడు 2కోట్ల 95లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా మున్నూరు కాపు,గంగపుత్ర, చౌదరి,గౌడ,యాదవ మరియు ఇతర కులస్తులకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

నాడు రంగశాయిపేట ప్రజలకు తాను మాట ఇచ్చానని ఎన్నికలు ఏవైనా పలితాలేమైన రంగశాయిపేట దత్తత తీసుకొని గొప్పగా అభివృద్ది చేస్తానని చెప్పానని నేడు ఆ దిశగా సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.

నేడు శంకుస్థాపన చేసిన 3కోట్లు కాకుండా అదనంగా 4కోట్ల రూపాయలు కేటాయించమని అతి త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

మునుముందు రంగశాయిపేటను మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని అతి సమీపంలోనే 313 కోట్లతో రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రంగశాయిపేటను అభినవ అభివృద్ధి పేటగా మారుస్తానని ఎమ్మెల్యే అన్నారు.

డివిజన్ ప్రజలందరు అన్ని రకాలుగా బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండు చందన,మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పిఏసిఎస్ చేర్మెన్ కేడల జనార్దన్,

డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

మంథని నియోజకవర్గంలో భారాస నుండి టికెట్ ఆశించి భంగపడ్డ చల్లా నారాయణ రెడ్డి పయనమెటు అన్నది నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది. భారాస మంథని నియోజకవర్గంలో అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానని కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణ రెడ్డి ఉవ్విళ్ళూరారు. నియోజక వర్గంలోని ప్రతి మండలాన్ని, గ్రామాలను విస్తృతంగా పర్యటించి మంచి చెడు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మంథని నియోజకవర్గం భారాస ఇంఛార్జీ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పక్కనబెట్టి తనకే టికెట్ కేటాయింపు జరుగుతుందని అధిష్ఠానం ఆశీస్సులు తనకే ఉంటాయని భావించారు. కానీ అధిష్ఠానం పుట్ట మధు పేరు ప్రకటించడంతో డోలాయమాన పరిస్థితి ఏర్పడింది. మంథని ఇవతల కాటారం, మహదేవపూర్, మల్హర్రావు,మహాముత్తారం, పల్మెల మండలాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా మంథని, కమాన్ పూర్, రామగిరి, మంథని ముత్తారం మండలాల్లో విస్తృతంగా పర్యటించి సంబంధాలు మెరుగు పరుచుకున్నారు. ఈసారి  మంథని ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం తో ఉండగా అధిష్ఠానం పుట్ట మధును  అభ్యర్థి గా ప్రకటించడంతో ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచన లో పడ్డారు చల్ల నారాయణ రెడ్డి. అధిష్ఠానం నిర్ణయంపై పునరాలోచన చేస్తూ కార్యకర్తల మనోభాలకనుగుణంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని నారాయణ రెడ్డి ప్రకటించారు. ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్ నుండి ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు,భారాస నుండి పుట్ట మధు,భాజపా నుండి సునీల్ రెడ్డి లు మంథని నియోజకవర్గంలో త్రిముఖ పోరుకు సిద్ధం అయ్యారు. ఈ తరుణంలో మంథని భారాస టికెట్ ఆశించి భంగపడ్డ చల్లా నారాయణ రెడ్డి ఎటు వైపు వెళ్తారు. మంథని లోని భారాస అసమ్మతి గళం విప్పిన నేతలను అక్కున చేర్చుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా... లేక ఇతర  పార్టీల లో చేరి తన బలాన్ని పలుకుబడిని ఉపయోగించి తన సామాజిక వర్గం మద్దతు సమీకరించి  మంథని నియోజకవర్గంలో పోటీ లో ఉంటారా...అన్నది చర్చనీయాంశం అయింది. తెలుగు దేశం,బీఎస్పీ,అమ్ ఆద్మీ పార్టీ లాంటి వారితో సంప్రదించి మంథని అభ్యర్థి గా రంగంలోకి దిగుతారా..అనేది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మరో రెండు నెలల సమయం ఉండడంతో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికి అంతుపట్టని పరిస్థితి నెలకొంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



నాన్ లేఅవుట్ వెంచ‌ర్లు చేసేవారిపై  క‌ఠిన త‌ప్ప‌వ‌ని కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్ అన్నారు. వ‌రంగ‌ల్ జిల్లా ఐన‌వోలు మండ‌లం పంథిని, పున్నెలు గ్రామాల ప‌రిధిలో అక్ర‌మ వెంచ‌ర్ల ఏర్పాటు విష‌యం చైర్మ‌న్ దృష్టికి రాగా ఆయ‌న బుధ‌వారం రోజున కుడా అధికారుల‌ను ఆదేశించారు. పంథిని గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 26 లో లోకేష్‌, సాగ‌ర్ రెడ్డి అనే వ్య‌క్తులు దాదాపు 6  ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన అక్ర‌మ వెంచ‌ర్ లో ఏర్పాటు చేసిన హ‌ద్దు రాళ్ల‌ను కుడా సిబ్బంది తొల‌గించారు. ప్ర‌హారీ కూల్చివేశారు. స‌ద‌రు వ్య‌క్తుల‌కు నోటీసుల‌ను సైతం అంద‌జేశారు. అలాగే పున్నెలు స‌ర్వే నంబ‌ర్ 81 లో రెండు ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచ‌ర్‌తో పాటు అదే గ్రామ ప‌రిధిలోని 583 స‌ర్వే నంబ‌ర్  20 గుంట‌లు విస్తీర్ణంలో ఉన్న మ‌రో నాన్ లేఅవుట్ వెంచ‌ర్ కుడా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  భూ య‌జ‌మానుల‌కు నోటీసులు అంద‌జేశారు. ఎవ‌రు నాన్ లేఅవుట్ వెంచ‌ర్లు చేసిన ఉపేక్షించ‌బోమ‌ని, క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్ హెచ్చ‌రించారు. ఎవ‌రైనా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వెంచ‌ర్ ఏర్పాటు చేసిన కుడా అధికారుల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు. అంతే కాకుండా నాన్ లేఅవుట్ ప్లాట్ల‌ను కొనుగోలు చేసి వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చారు. గృహ నిర్మాణ అనుమ‌తులు, మౌలిక వ‌స‌తుల లేమీతో ఇబ్బందిప‌డుతున్నార‌ని వివ‌రించారు. భూ య‌జ‌మానులు ఎవ‌రైనా వెంచ‌ర్ ఏర్పాటు చేయ‌ద‌లిస్తే కుడా ఆధ్వ‌ర్యంలో ప‌బ్లిక్ - ప్రైవేట్ పార్ట‌న‌ర్‌షిప్ ప‌ద్ధ‌తిలో వెంచ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని ,ఇటీవ‌లే ఉనికిచ‌ర్ల‌లో సైతం కుడా లేఅవుట్ వేంచ‌ర్ ఏర్పాటు చేసి అమ్మ‌కాలు జ‌రిపిన విష‌యాన్ని గుర్తు చేశారు. కావున వినియోగ‌దారులెవ‌రూ నాన్ లేఅవుట్ వెంచ‌ర్ల‌లో ప్లాట్ల‌ను కొనుగోలు చేయ‌రాద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి   పుల్లా కరుణాకర్    అన్నారు.

బుధవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో  డీఎస్పీ, సీఐలు, ఎస్ హెచ్ ఓ  లతో  ఎస్పీ   గారు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ కరుణాకర్   మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి, భాదితులకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసుల పనితీరు ఉండాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, 

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా బైండోవర్, ఎక్సైజ్ కేసులు , ఎన్ డిడబ్ల్యు అమలు,  ఆయుధాల డిపాజిట్ పై దృష్టి పెట్టాలని అన్నారు. నేర నియంత్రణకు, నేర చేధనకు ఎంతగానో ఉపయోగపడే సిసి  కెమెరాల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు  అయ్యేలా  ప్రోత్సహించాలని ఎస్పి  అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పి రామోజు రమేష్,  ఏ. ఆర్ అదనపు ఎస్పీ వి శ్రీనివాస్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ. రాములు, జి.  రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా :ఎల్తూరి సాయికుమార్ స్వేరో


అశోక జంక్షన్ 

తేది: 22/08/2023

మంగళవారం 

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా ఎల్తురి సాయికుమార్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు విడుదల చేయాలని మరియు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివేవారు కావున వారికి స్కాలర్షిప్లు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అతి తొందరలో దయతలిచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా వెల్తూరి సాయికుమార్ స్వేరో డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివకుమార్, ఉల్లేరావు బన్నీ, శ్రావణ్, రజిని, చందు, సిద్ధూ, హరీష్, నరేష్ ,సురేష్, శీను, రమేష్ ,వంశీ ,బన్ని, వర్షన్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

  

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ 



;నేడు  సోమవారం  నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు  కార్యాలయంలో నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్  ప్రకటించారు.  ఫిర్యాదుదారులు ఎవరు తమ ఫిర్యాదులను అందజేసేందుకు జిల్లా  కార్యాలయంకు  రావద్దని ఎస్పి  ఆదివారం   పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని  ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులపై ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ   డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్   యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, షేక్ రిజ్వాన్ బాషా తో కలిసి కాళోజి కళాక్షేత్రం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ కాళోజి కళాక్షేత్ర నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాళోజి ప్రాముఖ్యత, విశిష్టత చరిత్ర తెలిపేలా నిర్మాణ పనుల్లో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కళాక్షేత్రo నిర్మాణంలో సైతం  శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆడిటోరియం నిర్మాణంలో సాంస్కృతిక మండలి వారు సూచించే సలహాలను  పాటించాలని తెలిపారు.  కాళోజి కళాక్షేత్రంలో  కాళోజీ ఫౌండేషన్,  కవి సమ్మేళనాలా నిర్వహణకు ప్రత్యేక  సదుపాయం కల్పించాలని సూచించారు. కాళోజి విగ్రహం, చిత్ర మాలికలకు ప్రత్యేక స్థానాలను కేటాయించాలని సూచించారు.

కాళోజి ఆర్ట్ గ్యాలరీ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి అని అన్నారు.కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఆడిటోరియం, ఎంట్రెన్స్, సౌండ్ సిస్టం, సీటింగ్ పనుల్లో ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.  పనులను సకాలంలో పూర్తి చేయాలని,  కాళోజి కళాక్షేత్ర నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గతంలో సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో 

 కూడా సీపీఓ అజిత్ రెడ్డి, డీఈఈ రఘునందన్ రావు, ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సత్వరమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. 

శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి  ఆసరా ఫించన్, తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ,  వృద్దాప్య ఆసరా ఫించన్ దారులు మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ఆసరా ఫించన్ దరఖాస్తులు వారం లో మంజూరు చేయాలని సీఎస్ తెలిపారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ సంబంధించి జిల్లా కమిటి స్క్రూటినీ పూర్తి చేసి  జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ పత్రాలు సెప్టెంబర్ 15 నాటికి పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. 

స్వాతంత్ర్య  వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 26న కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని, ఆగస్టు 26న జరిగే ప్లాంటేషన్ లో ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని సీఎస్ అన్నారు.  

నీటి పారుదల శాఖ పరిధిలోని భూములలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలలో లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ 2 వారాల్లో పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని సీఎస్ తెలిపారు.

గొర్రెల పంపిణీ పథకం క్రింద జిల్లాలకు  నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవాలని , గొర్రెల యూనిట్ల కొనుగోలు వేగవంతం చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీఎస్ పేర్కొన్నారు. గొర్రెల యూనిట్లతో పాటు వాటికి దాణా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీ లక్ష్యాలను త్వరగా చేరుకునేందుకు అదనపు బృందాలను పంపాలని అన్నారు.  

బీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం క్రింద మొదటి దశలో మంజూరైన  నిధులు త్వరితగతిన   లబ్దిదారులకు అందించాలని  సీఎస్ సూచించారు.  మైనారిటీల సంక్షేమం క్రింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంలో జనాభా ప్రాతిపదికన జిల్లాలకు నిధులు విడుదల చేశామని, జిల్లాలకు కేటాయించిన లక్ష్యాల మేరకు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఆర్థిక సహాయం పంపిణీ చేయాలని అన్నారు. పెండింగ్ ప్రభుత్వ కారుణ్య నియామకాల  భర్తీ వారం రోజులలో పూర్తి చేయాలని సీఎస్ అన్నారు.

గృహలక్ష్మి పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల 40 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు 5 లక్షల 44 వేల దరఖాస్తుల క్షేత్రస్థాయి ధృవీకరణ పూర్తయిందని, నిర్దేశిత సమయంలో క్షేత్రస్థాయి స్క్రూటిని పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని,  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హూలను ఎంపిక చేసి లబ్దిదారుల జాబితా జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తీసుకొని మంజూరు చేయాలని సీఎస్ తెలిపారు. 

సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని,  స్థానిక ఎమ్మెల్యే సమయం తీసుకుని త్వరితగతిన పంపిణీ పూర్తి కావాలని అన్నారు.   ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పెండింగ్ రుసుము  వసూలు ప్రణాళికాబద్ధంగా చేయాలని, 10 లక్షల కంటే ఎక్కువ రుసుము ఉన్న లబ్ధిదారుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ పేర్కొన్నారు.  రెండవ దశ జీఓ 59 కింద దరఖాస్తుల ధృవీకరణ పై శ్రద్ద వహించి వారం రోజులలో ధృవీకరణ పూర్తి చేయాలని అన్నారు. 

ప్రభుత్వ ఉత్తర్వు 58 కింద వచ్చిన దరఖాస్తుల ధృవీకరణ పూర్తి చేసి అర్హులకు పట్టాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నోటరి భూముల క్రమబద్ధీకరణ దిశగా వచ్చిన దరఖాస్తుల ధృవీకరణ ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని అన్నారు.  61 సంవత్సరాల నిండిన విఆర్ఎ వారసులకు ఉద్యొగ కల్పనకు సంబంధించి ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. 

జిల్లా వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ సీక్త పట్నాయక్, కమిషనర్ రిజవాన్ బాషా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి  జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day





మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడగట్ గ్రామస్తులు దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడిఓ భారతికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తుండగా బోడగట్ గ్రామంలో 40 దళిత కుటుంబాలు ఉన్నాయని కేవలం రెండు మాత్రమే కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 40 కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని వారు స్థానిక అధికారులకు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు ఈకార్యక్రమంలో బొడగట్ దళిత కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టివి న్యూస్ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి పవన్

దేశ ప్రజలకు దేశ సరిహద్దుల్లో పగలు రాత్రి ఎండ వాన చలి మంచు అని తేడా లేకుండా  నిత్యం దేశ రక్షణ కోసం తపిస్తున్న  ఆర్మీ జవాన్లకుదేశ అభివృద్ధి కోసం దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడటం కోసం నిత్యం శ్రమిస్తున్న  కార్మికులకు దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కార్మిక నాయకుడు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత రాజకీయ విశ్లేషకులు శుభాకాంక్షలు తెలియజేశారు వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశ ప్రజల అవసరాలు అమాయకతత్వం ఐకమత్యం లేకపోవడం వలన వీటి  అన్నిటిని ఆసరాగా తీసుకొని 200సంవత్సరాలు భారతదేశాన్ని  బ్రిటిష్ వాళ్ళు పాలించారని ఆవేదన వ్యక్తం చేశారు బ్రిటిష్ కాలంలో  మన పూర్వీకులు చెప్పుకునే ఆవేదన గురయ్యారని గుర్తు చేశారు మనదేశంలో పుట్టిన మేధావులు స్వాతంత్ర సమరయోధులు ప్రపంచంలో ఎక్కడ లేరని చరిత్ర చెబుతున్నాయని గుర్తు చేశారు ప్రస్తుతం దేశంలో అవినీతి అభివృద్ధికి అడ్డుగోడల మారిందని దీనిపై దేశ పౌరులు యువకులు మేధవులు విద్యావంతులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్‌లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ ఎంత సంచలనం రేపిందో తెలియనిది కాదు. అదే తరహాలో నిన్న రాత్రి మహిళ దారుణ హత్య సంచలనం రేపింది.


శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. మహిళకు 35 - 36 ఏళ్లు ఉండొచ్చని సమాచారం.


రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. శంషాబాద్ లో సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ తర్వాత ఇది రెండవ కేసు కావడం గమనార్హం. అసలు ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం కానుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసు విషయమై రంగంలోకి దిగాయి...!!

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.


ఈ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ సర్టిఫికెట్ తీసుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ‘మీ సేవ’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.


మరి కొద్ది మంది మండలాఫీసులకు క్యూ కడుతున్నారు. స్కీమ్ కింద వచ్చే సాయం కోసం గడువు తక్కువగా ఉండడంతో ఆ లోపే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందడం వారికి కత్తిమీద సాములా మారింది.


*ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు..*

గృహలక్ష్మి’ పథకానికి అప్లై చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో గరిష్ట వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షకు మించి ఉండొద్దని ప్రభుత్వం సీలింగ్ విధించింది. ఆ ప్రకారం మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నది.


ఇప్పటికే చాలా పథకాలకు మహిళలు ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం తలెత్తలేదు. కానీ ఈ స్కీమ్‌ కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకే తరహా విధానాన్ని అమలు చేయడం లేదు. దీని బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పడంతో ఒక్కో డిస్ర్టిక్‌లో ఒక్కో తీరులో షెడ్యూల్ ఖరారైంది...!!

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

పెద్దపల్లి, ఆగస్టు 08:

పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్‌ మండలం, కునారం గ్రామంలోని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యుపీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.


ఈ మేరకు వెంకటేశ్‌ పేరిట మంగళవారం విడుదల చేసిన లేఖలో కునారం భూములకు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించారు. కునారం గ్రామంలో 1200 ఎకరాల పోరంబోకు భూములు ఉండగా, దాదాపు 600 ఎకరాల భూములను పేద, మధ్య తరగతి ప్రజలు చాలా కాలం నుంచి ఎకరం, రెండెకరాలు దున్నుకుంటున్నారని వివరించారు. ఆ భూములను వాళ్లే దున్నుకోవాలని స్పష్టం చేశారు.


అలాగే మిగతా 600 ఎకరాల భూములను భూ స్వాములైన దండ నర్సింహరెడ్డి 200 ఎకరాలు, గీట్ల రాజేందర్‌ రెడ్డి 60 ఎకరాలు, గీట్ల నిర్మల 60 ఎకరాలు, గొర్ల సుదర్శన్‌ 30 ఎకరాలు, మిగిలిన భూములను పలుకుబడి ఉన్న పెద్దలు ఆక్రమించినట్లు ఆరోపించారు.

   

ఈ భూములను ఎల్‌. రాజయ్యకు 30 ఎకరాలు, శ్రీనివాస్‌కు 30 ఎకరాలు అమ్మారన్నారు. సదరు భూములను 200 మందికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు ఈ భూములను పేదలకు ఇప్పిస్తామని చెప్పి ముఖం చాటేసి భూస్వాముల పక్షానే నిలిచారని ఆరోపించారు.


భూములను ఆక్రమించిన భూస్వాములు, పెత్తందార్లు ఆ భూములను సాగు చేయడం నిలిపివేయాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోరాడి ఆక్రమించిన భూములకు పట్టాలు చెయిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేనిచో ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదన్నారు


అలాగే పెద్దపల్లి మాజీ విలేకరి కట్టా నరేంద్రచారి, కంది చొక్కారెడ్డిలు పెద్దపల్లి పట్టణం, దాని చుట్టు పక్కల ఉన్న వివాదస్పద భూములను అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో కొనుగోలు చేసినట్టు దొంగ పట్టాలు చేయించి, అమాయక ప్రజలకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముస్లిం వ్యక్తి భూమిని కొనుగోలు చేశానని నమ్మించి ప్లాట్లుగా మార్చి అమ్మారని, తీరా ఆ భూమిలో ఇల్లు కట్టుకుందామని పోగానే, పట్టాదారు వచ్చి ఈ భూములు మావేనని చెప్పడంతో కొనుగోలు చేసిన వారు నష్టపోవాల్సి వచ్చిందన్నారు.


అలాగే బొంపల్లి, కాసులపల్లి, గౌరెడ్డిపేటలలో ఉన్న దేవాదాయ భూములను సైతం దొంగ పట్టా చేసుకొని ఆక్రమిస్తూ అక్రమంగా అమ్ముకుంటున్నారన్నారు. ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి అమ్ముతూ మోసం చేస్తున్నారన్నారు. ప్రజలు కొనుగోలు చేసిన భూములకు తిరిగి డబ్బులు చెల్లించాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని వారిని మావోయిస్టు నేత వెంకటేశ్‌ హెచ్చరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

అర్హులకు ప్రభుత్వ పథకాలు సత్వరమే అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి  తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణకు హరితహారం క్రింద ఉన్న లక్ష్యాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని, దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని అన్నారు. 

నీటి పారుదల శాఖ పరిధిలోని భూములలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలలో లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ 2 వారాల్లో పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని సీఎస్ తెలిపారు.

గొర్రెల పంపిణీ పథకం క్రింద జిల్లాలకు ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యం త్వరితగతిన చేరుకోవాలని సీఎస్ సూచించారు. ఈ వారం నుంచి ప్రతి జిల్లాకు గొర్రెల యూనిట్ల పంపిణీ లక్ష్యం రెట్టింపు చేశామని, గొర్రెల యూనిట్ల కొనుగోలు వేగవంతం చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీఎస్ పేర్కొన్నారు. గొర్రెల యూనిట్ల కొనుగోలు బృందంలో జిల్లా స్థాయి అధికారి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధులచే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని, సదరు సమాచారం సామాజికమాధ్యమాల్లో ప్రచారం చేయాలని సిఎస్ తెలిపారు. 

బీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం క్రింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మంది లబ్దిదారులకు అందించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన నిధులు జిల్లాలకు విడుదల చేశామని, ప్రతి అసెంబ్లీ పరిధిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలతో ఆగస్టు 10 లోపు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.  

మైనారిటీల సంక్షేమం క్రింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంలో జనాభా ప్రాతిపదికన జిల్లాలకు లక్ష్యాలు నిర్దేశించామని అన్నారు. జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్దిదారులను ఎంపిక చేసి ప్రోసిడింగ్స్ జారీ చేయాలని, ప్రోసిడింగ్స్ జారీ చేసిన వెంటనే  నిధులు మంజూరు అవుతాయని చెక్కుల పంపిణీ చేపట్టవచ్చని అన్నారు. 

గృహలక్ష్మి పథకం క్రింద జిల్లాలో తహసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆగస్టు 10 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి క్రింద 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటి వరకు జిల్లాలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ఆగస్టు 10 వరకు వచ్చే దరఖాస్తుల జాబితా రూపొందించి ఆగస్టు 20 నాటికి క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. జిల్లా ఇంఛార్జి మంత్రిచే లబ్దిదారుల జాబితా ఆమోదింపజేసుకొని ఆగస్టు 25 నాటికి గృహలక్ష్మి ఇండ్ల మంజూరు పూర్తి చేయాలని అన్నారు. 

రెండవ దశలో  ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలనిప్రభుత్వం నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే లో సమన్వయంతో దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేయాలని సీఎస్ అన్నారు. 

దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసిన తరువాత లబ్దిదారులకు మార్కెట్ లో అందుబాటులో ఉండే వివిధ రకాల వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని, లబ్దిదారుల ఎంపిక పూర్తయితే నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేయడం ప్రారంభిస్తామని సీఎస్ అన్నారు. 

సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.  జూలై మాసంలో వచ్చిన వరదల కారణంగా పట్టాల పంపిణీ ఆలస్యమైందని, స్థానిక ఎమ్మెల్యే సమయం తీసుకుని త్వరితగతిన పంపిణీ పూర్తి కావాలని అన్నారు.  

ప్రభుత్వ కారుణ్య నియామకాల కోసం 1266 కార్యాలయ సబార్డినేట్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 79 విడుదల చేసిందని, దాని ప్రకారం జిల్లాలో 10 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. కారుణ్య నియామకాల కింద డిగ్రి అర్హత ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్, మిగిలిన వారికి కార్యాలయ సబార్డినేట్ పోస్టులు కింద భర్తీ చేయాలని అన్నారు.

పోడు భూముల పట్టాల పంపిణీ జిల్లాలో చాలా శాతం పూర్తయిందని, పెండింగ్ లో ఉన్న   పట్టాలను త్వరితగతిన పంపిణీ చేయాలని అన్నారు. జిల్లాలో అటవీ భూమి తదుపరి ఆక్రమణకు గురీ కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు.  ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద  క్రమబద్ధీకరణ కోసం ఎంపికైన లబ్దిదారుల నుంచి రుసుము వసూలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 

ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పలుమార్లు నోటిసు జారీ చేసినప్పటికీ స్పందన లేని లబ్దిదారుల ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించాలని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వు 58 కింద ఉచితంగా పేదలకు క్రమబద్ధీకరణ పూర్తి చేశామని, ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పెండింగ్ రుసుము 3 వారాలో వసూలు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. 

ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం  అనుమతించిందని అన్నారు. 125 గజాల కంటే తక్కువ ఉన్న నోటరి భూములను  స్టాంప్ డ్యూటీ లేకుండా క్రమబద్దికరిస్తామని, 125 గజాల కంటే ఎక్కువ ఉన్న నోటరి భూములను స్టాంప్ డ్యూటీ వసూలు చేసి క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఆన్ లైన్ మీ సేవా ద్వారా నోటరి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వికరిస్తున్నామని, దీని పై పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. నోటరి భూముల కింద ఇప్పటి వరకు ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని అన్నారు.  

హనుమకొండ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్  మహేందర్ జీ , జిల్లా అటవీ శాఖ అధికారి వసంత లావణ్య,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

వరంగల్ జిల్లా:ఆగస్టు 05

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు జేఎండబ్ల్యూపీ (JMWP) డివిజన్ కమిటీ లేఖ రాసింది. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని లేఖలో కోరింది. 

అత్యంత భారీ వర్షంతో కొండాయి, మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుని చనిపోయిన వారందరికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇల్లు, రూ.10 లక్షల రూపాయులు వెంటనే చెల్లించాలి.

జూలై 27న వచ్చిన అత్యంత భారీ వర్షంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలను అతలాకుతలం చేసింది.

భారీ వర్షాలతో వరదలు వచ్చి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ కుంటలు, చెరువులు తెగిపోవడంతో కొండాయి, దొండ్ల, మల్యాల, ప్రాజెక్టు నగర్, బూర్గుపేట, మోరంచపల్లితో సహా చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలంతా అర్తనాదాలు, అహాకారాలు, అరణ్యరోదనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు.

కొండాయిలో 8 మంది, మోరంచపల్లిలో నలుగురు, ప్రాజెక్టు నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, బూర్గుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా లెక్కలోకి రానివారు మరికొందరు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రచార ఆర్భాటాలు చేసింది, కానీ ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

ఈ వరదలతో తెగిన కుంటలను, చెరువులను వెంటనే పునరుద్ధరించాలి.

జంపన్న వాగు, మోరంచవాగు, చలివాగు పాటు అనేక వాగులు పక్కన ఉన్న పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తీయడానికి ప్రభుత్వమే ఎకరాకు రూ.లక్ష వెంటనే ఇవ్వాలి.

వరదలకు తెగిన రోడ్లను, వంతెనలను వెంటనే పునరుద్ధరించాలి.

వర్షాలతో వాతావరణం కలుషితమై మలేరియాతో పాటు అన్ని రకాల జబ్బులకు వెంటనే మెడికల్ క్యాంపులు పెట్టి వైద్యం అందించాలి.

మరో పంట కోసం అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి....

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

సీనియర్ డిసిబిలిటి వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా ఆధ్వర్యంలో కత్తుల బాలకృష్ణ అధ్యక్షతన వాయిస్ ఆఫ్ స్పెషాలి ఏబుల్ పీపుల్స్  సహకారంతో పదిమంది దివ్యాంగులకు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఎస్ దేవేందర్. చౌటుప్పల్ సిఐ చేతుల మీదగా దివ్యాంగులకు వాకర్స్, సంక కర్రలు, చేతి కర్రలు, ప్రతిభ ఒకేషనల్ కాలేజ్ గాంధీ పార్క్ చౌటుప్పల్ లో పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ కత్తులు మాట్లాడుతూ, వికలాంగుల సమస్యలు సిఐ కి వివరించారు. అలాగే వికలాంగులను తిట్టినా, వివక్షత చూపినా, అవిటితనంతో ఎత్తి చూపినా, కఠిన చర్యలు తీసుకోవాలని సెక్షన్ 92 ప్రతిష్టం చేయాలని, వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. సిఐ మాట్లాడుతూ... ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు దాతలకు, వికలాంగుల సోదరులకు, ధన్యవాదాలు తెలుపుతూ తన వంతు సహాయం కండరాల క్షీణత, బాధితుల కోసం నిత్యవసర సరుకులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కౌన్సిలర్ తాండూరు పరమేష్, చిలువేరు శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, శివకుమార్, రఘు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజక వర్గం ఇంచార్జీ పుట్ట మదన్న బహుజన వాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తున్నారని, బహుజన వాదం ముసుగులో అగ్రవర్ణాల పల్లకీ మొస్తున్నడని మహాదేవపూర్ ఎంపీపీ రాణీబాయి రామారావు ఆరోపించారు.బీసీ బిడ్డనైన నాపై అవిశ్వాసం పెట్టీ, అగ్రవర్ణాలకు ఎంపీపీ పదవిని అప్పగించాలని ఎందుకు క్యాంపు రాజకీయాలు చేశారో ప్రజలకు చెప్పాలని ఎంపీపీ డిమాండ్ చేశారు. ఎంపీపీ పదవిని చేపట్టిన రోజు నుండి, నేటి వరకు పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదని, ప్రజలకు సేవలు చేస్తూ, మండల అభివృద్ధి కోసం పాటుపడ్డామని ఎంపీపీ వివరించారు. అధికార పార్టీ లో ఉన్న మేము భూ కబ్జాలు చేయలేదని, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కలప స్మగ్లర్ల తో కుమ్మక్కు కాలేదని, ఇంత నిజాయితీగా ఉన్న మాపై పుట్ట మధు కక్షగట్టి అవిశ్వాసం పెట్టించి కుట్రపూరిత రాజకీయం ఎందుకు చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ పదవి ఉత్త పుణ్యానికే ఇవ్వలేదని, 80 లక్షల ముడుపులు పుచ్చుకుని ఇచ్చారని ఆరోపించారు. బహుజన వాదం పేరు తో రాజకీయాలు చేస్తున్నా పుట్ట మదన్న, బీసీ సామాజిక వర్గంకు చెందిన  రామగిరి ఎంపీపీ దేవక్క తో పాటు, మాపైన, దళితుడైన  మంథని ఎంపీపీ శంకర్ పైన కుట్ర చేస్తూ, మానసికంగా కృంగదీస్తున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవాడానికి సహకరించిన కాంగ్రెస్ ఎంపీటీసీ లకు, ఎంపీపీ రాణీబాయి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీనీ వీడి మరో పార్టీలో చేరే ఆలోచన లేదని, ప్రజలు, మిత్రులు, స్నేహితులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని ఎంపీపీ స్పష్టం చేశారు. మరో ఏడాది పాటు మండల అభివృద్ధి కోసం పాటు పడతామని ప్రకటించారు. పుట్ట మధు మాయమాటలకు బహుజనులు మోసపోవద్దని నియోజక వర్గం ప్రజలకు ఎంపీపీ రాణీబాయి రామారావు విజ్ఞప్తి చేశారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

హైదరాబాద్‌: రానున్న రెండేళ్ల కాలానికి (2023-25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది.

ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించాల్సిన ప్రక్రియపై మంగళవారం అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్‌ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా, 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం.. అయితే గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తొంది...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


వరంగల్ జిల్లా:ఆగస్టు 02

జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సందర్శించారు. ఈ సందర్భంగా వరదలతో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులతో మాట్లాడారు. అనంతరం ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపణీ చేశారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుందని తెలిపారు.

వరంగల్ పట్టణానికి నలువైపులా ఉన్న చెరువులకు వరద పోటెత్తిన కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు.

భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని తెలిపారు. స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా జవహర్ నగర్ కాలనీ బ్రిడ్జిని పున:నిర్మించాలని కోరుతున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టలేదని అన్నారు. ముంపు ప్రాంతాల్లో పరిశీలించి, ప్రజల పరిస్థితిని చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు...